Cheetahs అరుదైన చిరుతలు.. దాదాపు 70 ఏళ్ల క్రితం భారతదేశంలో అవి అంతరించిపోయాయి. ఇప్పుడు వాటిని మళ్లీ దేశంలో పునరుజ్జీవం చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధమైంది. 70 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను తీసుకువస్తోంది. ఈ ఆగస్టులో ఐదారు చిరుతలు భారత్ కు రానున్నాయి.
1947లో దేశంలో చివరిసారిగా చిరుతపులి ఆనవాళ్లు కనిపించాయని నిపుణులు చెబుతున్నారు. 1952లో దేశంలో చిరుత పులులు అంతరించిపోయినట్లు సమాచారం. దీంతో వీటిని మొదటి దశంలో రూ.14 కోట్లు వెచ్చించి మరీ కేంద్రం దక్షిణాఫ్రికా నుంచి 14 చిరుతలను భారత్ కు తీసుకువస్తోంది. కోవిడ్-19 కారణంగా చాలా సంవత్సరాల ఆలస్యం తర్వాత ఆగస్టులో దక్షిణాఫ్రికా నుండి మొదటి బ్యాచ్ చిరుతలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తీసుకువస్తోంది..
ఈ చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో వదలుతారు. ఈ చిరుతలకు మాంసాహారం లభించేలా వణ్యప్రాణులను ఉంచుతున్నారు. చిరుతల ఆహారం లభించేలా సకల సౌకర్యాలు ఈ అడవిలో ఏర్పాటు చేస్తున్నారు.
చిరుతలను తీసుకురావడానికి అన్ని విధానాలు పూర్తయ్యాయని, దక్షిణాఫ్రికాతో ఒప్పందం కుదిరిందని కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చిరుతలను భారతదేశానికి తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ బృందం ఇప్పటికే దక్షిణాఫ్రికాలో ఉంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి తుది క్లియరెన్స్ కోసం వేచి ఉంది.
దక్షిణాఫ్రికా నిపుణుల బృందం జూన్ 15న భారత్‌కు వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రిజర్వ్ ఫారెస్టును సందర్శించనుంది. ఈ మంత్రిత్వ శాఖ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) మరియు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సమన్వయం చేస్తోంది, ఇది ప్రభుత్వం కోసం ఈ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తుంది.
మహారాజా రామానుజ్ ప్రతాప్ సింగ్ డియో 1947లో భారతదేశంలో చివరి మూడు ఆసియా చిరుతలను వేటాడినట్లు నసమాచారం.. 1952లో, చిరుత భారతదేశంలో అంతరించిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అటవీ నష్టం.. ఆవాసాల పెరుగుదల మరియు వేట కారణంగా భారతదేశంలో అంతరించిపోయిన ఏకైక పెద్ద మాంసాహార జంతువు చిరుత. చిరుతను మళ్లీ దేశంలో పునరుజ్జీవం చేయాలనే ప్రణాళిక దశాబ్దాలుగా సాగుతోంది. ప్రస్తుత ప్రతిపాదన 2009లో కొలిక్కి వచ్చింది. 2020లో సుప్రీంకోర్టు క్లియర్ చేసింది.
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2010లో రాజస్థాన్‌లోని షేర్‌ఘర్ వైల్డ్‌లైఫ్ అభయారణ్యం మరియు ముకుందరా హిల్స్ టైగర్ రిజర్వ్ మరియు కునో నేషనల్ పార్క్, గాంధీ సాగర్ వైల్డ్‌లైఫ్ అభయారణ్యం, నౌరదేహి వన్యప్రాణుల అభయారణ్యం మరియు మధ్యప్రదేశ్‌లోని మాధవ్ నేషనల్ పార్క్ వంటి ఆరు ప్రదేశాలను ఈ చిరుతలను ఉంచేందుకు ప్రతిపాదించింది. వణ్యప్రాణులు, వసతులు.. చిరుతల పునరావాసం కోసం అన్ని మెరుగ్గా ఉన్నా ‘కునో’ అభయారణ్యంను చివరకు ఎంపిక చేశారు.
మొదటి బ్యాచ్ చిరుతలు భారతీయ పరిస్థితులకు అలవాటుపడిన తర్వాత రాబోయే దశాబ్దాల్లో 35-40 చిరుతలను భారతదేశంలోని ఇతర అడవుల్లోకి మార్చే అవకాశం ఉందని ఇన్‌స్టిట్యూట్‌లోని నిపుణులు తెలిపారు.