Site icon OkTelugu

Montenegro: చెట్టులో వాటర్ ఫాల్.. ఈ ప్రకృతి వింత చూశారా?

Montenegro

Montenegro

Montenegro: ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు చోటు చేసుకుంటాయి. కొన్ని మనకు తెలిసినా.. మరికొన్ని తెలియకుండానే ఉంటాయి. అయిే సోషల్ మీడియా వచ్చాక.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా తెలిసిపోతుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక చెట్టు నుంచి నీరు ఉబికి వస్తోంది. సాధారణంగా భూమి నుంచి నీరు బయటకు వస్తాయి. ఆయా ప్రాంతాల్లో వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటు బోరు బావుల్లో నుంచి నీరు ఉబికి వచ్చిన విషయాల గురించి తెలుసుకున్నాం.. కానీ వింతగా చెట్టు నుంచి నీరు రావడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియో వివరాల్లోకి వెళితే..

యూరప్ ఖండంలో భూభాగం విభిన్నంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని మాంటెనెగ్రో దేశంలోని దినోసా అనే గ్రామంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. అయితే ఈ గ్రామం పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇక్కడున్న ఒక చెట్టు నుంచి పంప్ నుంచి వచ్చినట్లు నీరు వస్తోంది. వర్షం పడిన సమయంలో వరద ఎక్కువై ఇలా వస్తుందని అనుకోవచ్చు. కానీ వర్షం తగ్గినా.. ఆ చెట్టు నుంచి నీరు వస్తూనే ఉంది. దీంతో ఈ గ్రామాన్ని వాటర్ ట్రీ విలేజ్ అని పిలుస్తున్నారు.

ఈ గ్రామంలో ఉన్న మల్బరీ చెట్టు నుంచి ఇలా నీరు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలా జరగడానికి కారణమేంటో తెలియదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అయితే చెట్టులోపల భూమిలో నీటి బుంగలు ఏర్పడి ఇలా నీరు ఉబికి వస్తుందని అంటున్నారు. అయితే ఇటువంటి చెట్లు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ ఇలా వ్యవసాయ పంపు మోటార్ లా నీరు రావడం ఆసక్తిగా మారిందని అనుకుంటున్నారు. ఇండియాలోనూ ఇటువంటి చెట్లు ఉన్నాయి. క్రొకడైల్ బార్క్ ట్రీ అనే పేరుతో ఇక్కడ పిలుస్తారు.

Exit mobile version