https://oktelugu.com/

Naga Shaurya Dowry : నాగ శౌర్య ఎన్ని కోట్ల కట్నం తీసుకున్నాడో తెలుసా?

Naga Shaurya Dowry : యంగ్ హీరో నాగ శౌర్య సడన్ గా పెళ్లి ప్రకటన చేశారు. నవంబర్ 20న బెంగుళూరులో నాగ శౌర్య వివాహం జరగనుంది. ఉదయం 11:25 నిమిషాలు ముహూర్తంగా నిర్ణయించారు. ఒకరోజు ముందే పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. నాగ శౌర్య వివాహానికి బెంగుళూరు నగరంలోని మారియట్ వేదిక కానుంది. 19వ తేదీన మెహందీ వేడుక నిర్వహించనున్నారు. నాగ శౌర్య వివాహ ఏర్పాట్లు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. నగలు, బట్టలు డిజైనర్స్ రూపొందిస్తున్నారు. ఈ వివాహ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2022 / 03:12 PM IST
    Follow us on

    Naga Shaurya Dowry : యంగ్ హీరో నాగ శౌర్య సడన్ గా పెళ్లి ప్రకటన చేశారు. నవంబర్ 20న బెంగుళూరులో నాగ శౌర్య వివాహం జరగనుంది. ఉదయం 11:25 నిమిషాలు ముహూర్తంగా నిర్ణయించారు. ఒకరోజు ముందే పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. నాగ శౌర్య వివాహానికి బెంగుళూరు నగరంలోని మారియట్ వేదిక కానుంది. 19వ తేదీన మెహందీ వేడుక నిర్వహించనున్నారు. నాగ శౌర్య వివాహ ఏర్పాట్లు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. నగలు, బట్టలు డిజైనర్స్ రూపొందిస్తున్నారు. ఈ వివాహ కార్యక్రమానికి నాగ శౌర్య కోట్లలో ఖర్చు చేస్తున్నారట. బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా ఆయన వివాహం జరగనుంది. 
     
    నాగ శౌర్య వివాహానికి చిత్ర ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. నాగ శౌర్యకు కాబోయే అమ్మాయి పేరు అనూష శెట్టి. ఈమె ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్. బెంగుళూరు కేంద్రంగా ఇంటీరియర్ డిజైన్ కంపెనీ నడుపుతున్నారు.  న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ ఇన్స్టిట్యూట్ నుండి సర్టీఫికేట్ పొందారు. మార్కెటింగ్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. మహిళా వ్యాపారవేత్తగా  ఇంటీరియర్ డిజైన్ విభాగంలో పలు అవార్డ్స్ అందుకున్నారట.
     
    నాగ శౌర్య ప్రొఫైల్ కి ఏమాత్రం తగ్గని క్వాలిఫికేషన్, క్వాలిటీస్ అనూష శెట్టికి ఉన్నాయి. మరి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ని సొంతం చేసుకుంటున్న అనూష ఎంత కట్నం ఇస్తున్నారనేది హాట్ టాపిక్ అయ్యింది. అయితే నాగ శౌర్య కట్నంగా ఒక్క రూపాయి తీసుకోవడం లేదట. అయినప్పటికీ అనూష వలన ఆయనకు కోట్ల సంపద దక్కనుంది. ఇంటీరియర్ వ్యాపారంలో ఆరితేరిన అనూష కంపెనీ టర్నోవర్ కోట్లలో ఉందట. భార్య సంపాదనలో భర్తకు కూడా హక్కు ఉంటుంది. కాబట్టి అనూష హీరో నాగ శౌర్యకు కోట్ల కట్నం ఇచ్చినట్లే అంటున్నారు. 
     
    ఇక నాగ శౌర్య కెరీర్ పరిశీలిస్తే… వరుస పరాజయాల్లో ఉన్నారు. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా లక్ష్య చిత్రం కోసం బాగా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ బాడీ చేశారు. అయినా మూవీ ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం నాగ శౌర్య హీరోగా నారీ నారీ నడుమ మురారీ, పోలీసు వారి హెచ్చరిక, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రాలు తెరకెక్కుతున్నాయి.