Site icon OkTelugu

Heroine Janhvi Kapoor Gym: ఎన్టీఆర్ హీరోయిన్ జాన్వీ జిమ్ వీడియో చూస్తే మీకు చెమటలు పడతాయి…. తడిసిన శరీరంలో మెంటల్ టార్చర్!

Heroine Janhvi Kapoor Gym
Heroine Janhvi Kapoor Gym

Heroine Janhvi Kapoor Gym: కెరీర్లో ఫస్ట్ టైం క్రేజీ ఆఫర్ పట్టేసింది జాన్వీ కపూర్. ఆమెకు బాలీవుడ్ లో దక్కని గోల్డెన్ ఛాన్స్ టాలీవుడ్ లో దక్కింది. ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్నారు. నిజానికి ఆమె ట్రాక్ రికార్డుకి ఈ సినిమాలో ఆఫర్ రాదు. స్టార్ హీరోల పక్కన ఎస్టాబ్లిష్ అయిన కమర్షియల్ హీరోయిన్స్ కి మాత్రమే ఛాన్స్ దక్కుతుంది. ఆమె కేవలం శ్రీదేవి కూతురన్న కారణంగా దర్శకుడు కొరటాల శివ ఈ చిత్ర హీరోయిన్ గా ఎంపిక చేశారు. శ్రీదేవి జూనియర్ ఎన్టీఆర్ తాతయ్యతో కలిసి నటించారు. వారి వారసులను జంటగా నటింపజేయడం ద్వారా హైప్ రాబట్టవచ్చనేదే అసలు కారణం.

శ్రీదేవి సౌత్ ని ఏలాక బాలీవుడ్ కి వెళ్లి సక్సెస్ అయ్యారు. శ్రీదేవిది ఎవర్ గ్రీన్ ఫేమ్ అండ్ ఇమేజ్. అందుకే ఆమె కూతురు జాన్వీ కపూర్ ని సౌత్ పరిశ్రమకు తేవాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఏవీ కార్యరూపం దాల్చలేదు. అసలు జాన్వీకి సౌత్ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి లేదు. అందుకే మేకర్స్ ప్రపోజల్స్ ఆమె తిరస్కరించారనే ప్రచారం జరిగింది. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు. ఆ మధ్య మిల్లీ చిత్ర ప్రమోషన్స్ కోసం జాన్వీ హైదరాబాద్ వచ్చారు. ఎన్టీఆర్ తో నటించే ఛాన్స్ వస్తే అసలు వదులుకోను. ఆయన గ్రేట్ యాక్టర్ అంటూ కొనియాడారు.

2018లో విడుదలైన ధడక్ మూవీతో జాన్వీ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. అయితే ఈ మూవీ విడుదలకు ముందే శ్రీదేవి ప్రమాదంలో కన్నుమూశారు. కూతురు జాన్వీని సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలన్న కల నెరవేరకుండానే ఆమె లోకాన్ని విడిచారు. పరిశ్రమకు వచ్చి ఐదేళ్లు అవుతున్నా ఆమెకు బ్రేక్ రాలేదు. కమర్షియల్ హీరోయిన్ గా ఎదగలేదు. ప్రయోగాత్మక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నారు.

Heroine Janhvi Kapoor Gym

మొదటిసారి ఎన్టీఆర్ వంటి బిగ్గెస్ట్ స్టార్ పక్కన ఛాన్స్ వచ్చింది. ఇక జాన్వీ హాట్ ఫోటో షూట్స్ కి పెట్టింది పేరు. జాన్వీని ఇంస్టాగ్రామ్ లో 21 మిలియన్స్ ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె క్రేజ్ ఏపాటిదో. కెరీర్లో ఒక్క బ్లాక్ బస్టర్ మూవీ లేకపోయినా గ్లామర్ తో అభిమాన గణాన్ని సంపాదించింది. జాన్వీ అందాలు చూస్తే ఎవడికైనా మతిపోవాల్సిందే. పర్ఫెక్ట్ ఫిట్ బాడీ సాధించేందుకు చాలా కష్టపడుతుంది. జాన్వీ ఒకసారి తన జిమ్ వీడియో షేర్ చేశారు. కఠిన కసరత్తులతో చెమటలు పట్టిస్తున్న ఆమెను చూస్తే కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టదు.

Exit mobile version