
Anil Kumar Yadav: రాజకీయంగా ఓడలు బళ్లవుతాయి..బళ్లు ఓడలవుతాయి అంటారు. చేతిలో పవర్ ఉంది కదా అని నోటికి పనిచెబితే.. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటే అది ఎబ్బెట్టుగా మారిపోతుంది. నలుగుర్నీ దూరం చేస్తుంది. అటువంటి సంకట పరిస్థితినే ఏరికోరి తెచ్చుకున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు సిటీ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న అనీల్ కుమార్ యాదవ్ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలోకి వచ్చిన తరువాత అదే దూకుడును కనబరుస్తూ వచ్చారు. దీంతో ఆయనలో ఉన్న ఫైర్ ను గుర్తించిన జగన్ మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. కీలక సాగునీటి శాఖను అప్పగించారు. కానీ మాటలు చెప్పేందుకు ఫైర్ ఉండాలి కానీ.. శాఖలో ప్రగతి చూపాలంటే మంచి పనితీరును కనబరచాలి. కానీ తొలి మూడేళ్లు మెదడుకు పనిచెప్పకుండా నోటితోనే సరిపెట్టారు. రాజకీయ ప్రత్యర్థులను తూలనాడుతునే.. సొంతపార్టీ వారికి వ్యతిరేకమయ్యారు. తీరా ఇప్పుడు మంత్రి పదవి పోయేసరికి ఒంటరయ్యారు.
చేతిలో మంత్రి పదవి ఉంది కదా అని చిన్నాపెద్దా చూడలేదు. ఎడాపెడా ప్రతాపంచూపారు. సీనియర్లు, పొలిటికల్ ఎంట్రీకి సాయపడ్డారన్న అభిమానం చూపలేదు. తిరిగి వారిపైనే ప్రతాపం చూపారు. ముఖ్యంగా నెల్లూరు పెద్దారెడ్లతో పెట్టుకున్నారు. జగన్ ప్రోత్సహిస్తున్నారన్న ఒకేఒక కాన్సెప్ట్ తో రెచ్చిపోయారు. తిరిగి జగన్ సామాజికవర్గ సమీకరణల లెక్క చెప్పి మంత్రి పదవి నుంచి తప్పించేశారు. పైగా తాను ఎంతగానో వ్యతిరేకించి కాకానిచేతికి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పటివరకూ చేదోడు వాదోడుగా ఉండే కోటంరెడ్డి సైడ్ అయిపోయారు. ఆయన వెంట నడుస్తామంటే గతంలో టీడీపీని టార్గ్ ట్ చేశారు.పోనీ పవన్ చెంతకు చేరుదామంటే వారిపై కూడా లేనిపోని మాటలు అనేశారు. అందుకే ఎక్కడికి వెళ్లాలో తెలియక.. ఏం చేయాలో పాలుపోక సైలెంట్ ను ఆశ్రయించారు.

వాస్తవానికి అనిల్ హవాభావాలు ఎవరికీ నచ్చవు. కానీ జగన్ ఆయనలో ఫైర్ చేశారు. కానీ ఆఫైర్ రోజురోజుకు నీరుగారిపోతోంది. దీంతో అనిల్ కు బదులు అల్ట్రనేషన్ నాయకుడ్ని తెరపైకి తెస్తారన్న ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో వందల మెజార్టీతో గట్టెక్కిన అనిల్ ఈసారిపోటీచేస్తే ఓటమి తప్పదని హైకమాండ్ కు ఒక నివేదిక వెళ్లినట్టు తెలుస్తోంది. అందుకే జగన్ సైతం ఆయన్ను లైట్ తీసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్టుగానే మొన్న మంత్రిగా కొనసాగేవరకూ తిరిగిన కేడర్ యూటర్న్ తీసుకుంది. అనిల్ వ్యతిరేకుల చెంతకు చేరుతోంది. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకటి నెల్లూరు పెద్దారెడ్లకు సరెండర్ కావడం, లేకుంటే జనసేన గూటికి చేరడం అన్న రెండు ఆప్షన్లే అనిల్ ఎదుట ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల నాటికి అనిల్ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అనివార్య పరిస్థితులు హైకమాండే కల్పిస్తుందన్న టాక్ అయితే మాత్రం నడుస్తోంది.