Top Extinct Animals: మనిషి అత్యాశ ఇతర జీవజాతులను అంతరించిపోయేలా చేస్తోంది. వేటాడడం.. వాటి మాంసం కోసం చంపడం.. విస్తరణ పేరుతో అడవులను కొల్లగొట్టడంతో ఆహారం దొరక్క చాలా జంతువులు అంతరించిపోతున్నాయి. భారతదేశంలో అయితే చిరుతల స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో అంతరించిపోయాయి. వాటిని మళ్లీ నమీబియా నుంచి తెప్పించి భారత అడవుల్లో ప్రవేశపెట్టాడు మోడీ. భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అరుదైన జీవజాతులు అంతరించిపోయాయి. ఇందులో భారీ ఖడ్గమృగాల నుంచి.. చిట్టి చీతకోకచిలుకల వరకూ ఉన్నాయి. గడిచిన 150 ఏళ్లలో అంతరించిపోయిన ఆ జంతువుల గురించి స్పెషల్ ఫోకస్.
తెల్ల ఖడ్గమృగం అతిపెద్ద క్షీరదాలలో ఒకటి. పరిమాణంలో ఏనుగు తరువాత రెండోది కావడం గమనార్హం. తెల్ల ఖడ్గ మృగం (సెరాటోథెరియం సిమమ్) భూమి మీద అతిపెద్ద రెండో జంతువు. సగటు బరువు ఐదు టన్నులు. దీని శరీర పొడవు నాలుగు మీటర్లు. వైట్ రినో అనే పేరుతో పిలిచే బోయర్ విజ్డే నుంి వ్చింది. ఆంగ్లేయులు దీనికి ఈ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ముదురు బూడిద రంగులో ఉండే ఉన్నప్పటికీ తెల్ల ఖడ్గమృగం రెండు కొమ్ములను కలిగి ఉంటుంది. దీని పొడవు 158 సెంటిమీటర్లు. తెల్ల ఖడ్గమృగం గడ్డిని కత్తిరించి తింటుంది. తెల్ల ఖడ్గమృగం ఆఫ్రికా ఖండంతో పాటు కాంో, దక్షిణ సూడాన్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వంటి దేశాల్లో నివసిస్తోంది. దీని సంతతి వేగంగా తగ్గిపోతోంది.
ఆఫ్రికా నల్ల ఖడ్గమృగం అంతరించిపోతోంది. అనేక దశాబ్దాలుగా ఈ జాతుల సంరక్షణకు చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. ఖడ్గమృగం చరిత్ర వందల సంవత్సరాలుగా ఉంది. నల్ల ఖడ్గమృగం ఆఫ్రికాలో కనిపిస్తోంది. ఇందులో రెండు జాతులు ఉన్నాయి. నల్ల ఖడ్గమృగం రెండు టన్నుల బరువు ఉంటుంది. పొడవు మూడు మీటర్ల కంటే ఎక్కువ. రెండు కొమ్ములు ఉంటాయి. ఆఫ్రికా మధ్య, తూర్పు, దక్షిణ భాగాలలో కనిపిస్తుంది.
ఆసియా చిరుత అంతరించిపోతోంది. అడవులు వేగంగా కనుమరుగైపోతున్న నేపథ్యంలో చిరుతలు కనిపించకుండా పోతున్నాయి.
డచ్ ఆల్కాన్ బ్లూ బటర్ ఫ్లై కూడా లేకుండా పోతున్నాయి. మీనపు కలర్ లో మెరిసే సీతాకోక చిలుకలు భవిష్యత్ లో ఇక కనిపించవు.
భారతీయ జవాన్ ఖడ్గమృగం ఇవి కూడా అంతరించిపోయాయి. వీటి సంతతి క్రమంగా కనిపించకుండాపోతోంది.
పింటా ఐలాండ్ తాబేలు కూడా కనిపించకుండా పోతోంది. వాతావారణ కాలుష్య ప్రభావంతో వాటి సంతతి క్రమంగా కనుమరుగవుతోంది.
పశ్చిమ ఆఫ్రికా ఖడ్గమృగం కూడా కనిపించడం లేదు. అక్కడ వాటి కొమ్ములకు ఉండే ప్రాధాన్యంతో వేటగాళ్లు వాటిని వేటాడి చంపుతూ క్రమంగా వాటి సంతతిని లేకుండా చేస్తున్నారు.
టెకోపా పప్ ఫిష్ ఇక్కడి చేపలు కూడా లేకుండా పోతున్నాయి. వాటి మనుగడ ప్రశ్నార్థకంలో పడుతోంది.
భారతీయ జవాన్ ఖడ్గమృగం కూడా కనిపించడం లేదు. గతంలో ఉన్న ఖడ్గమృగాల సంతతి ప్రస్తుతం కనిపించడం లేదు.
స్కోమ్ బర్గ్ జింకలు కూడా అంతరిస్తున్నాయి. అడవులు క్రమంగా క్షీణించడం వల్ల వాటి జనాభా పెరగడం లేదు. ఫలితంగా వాటి సంతతి కనుమరుగవుతోంది.
యాంగ్జీనది డాల్ఫిన్. చైనాలో ఉండే ఈ నది ప్రపంచంలోనే మూడోది. ఇక్కడ ఉండే డాల్ఫిన్ లు క్రమంగా వాతావరణ కాలుష్యం వల్ల అంతరించాయి.
ఉత్తర తెల్ల ఖడ్గమృగం కూడా కనిపించకుండా పోతోంది. వాటి జనాభా అంతరిస్తోంది.
జాంజిబార్ చిరుతపులుల జనాభా కూడా కనిపించడం లేదు. అడవులు లేకుండా చేయడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.
జవాన్ టైగర్ ఇండియాలో కనిపించే పులులు క్రమంగా అంతరిస్తున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో వాటి మనుగడ సాగడం లేదు.
ఇలా భారత్ లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలా జీవజాతులు అంతరించిపోతున్నాయి. మనిషి దురాక్రమణ, స్వార్థపూరిత చర్యలతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికైనా మనమూ బతికి ఇతర జంతువులను బతికించాల్సిన అవసరం ఉంది.
Also Read: Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ప్రేమికులకు భారీ షాక్… షో ఆపేయాలని డిసైడైన స్టార్ మా?