https://oktelugu.com/

Srileela : శ్రీలీల ముందు ఎన్టీఆర్ – రామ్ చరణ్ కూడా సరిపోరా!

Srileela : ప్రతీ ఏడాది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి క్యూ కట్టి వస్తూనే ఉంటారు.. కానీ కొంతమందికి మాత్రమే టాప్ స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉంటాయి..అలా టాప్ స్టార్ హీరోయిన్ గా కనీసం పదేళ్ల పాటు చేతినిండా సినిమాలు దక్కించుకునే రేంజ్ టాలెంట్ ఉన్న హీరోయిన్ శ్రీలీల..ఈ ఏడాది ఈమె ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా వెండితెర కి పరిచయమైంది..శ్రీకాంత్ కొడుకు రోషన్ బాబు హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 23, 2022 / 08:19 PM IST
    Follow us on

    Srileela : ప్రతీ ఏడాది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి క్యూ కట్టి వస్తూనే ఉంటారు.. కానీ కొంతమందికి మాత్రమే టాప్ స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉంటాయి..అలా టాప్ స్టార్ హీరోయిన్ గా కనీసం పదేళ్ల పాటు చేతినిండా సినిమాలు దక్కించుకునే రేంజ్ టాలెంట్ ఉన్న హీరోయిన్ శ్రీలీల..ఈ ఏడాది ఈమె ‘పెళ్లి సందడి’ అనే చిత్రం ద్వారా వెండితెర కి పరిచయమైంది..శ్రీకాంత్ కొడుకు రోషన్ బాబు హీరో గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

    కథా కథనం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఈ సినిమా సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం శ్రీలీల అంటూ ఆ సినిమా రన్నింగ్ సమయం లో కామెంట్స్ వినిపించాయి..అందం తో పాటు అద్భుతమైన అభినయం మరియు మెరుపు వేగం తో కూడిన శ్రీలీల డ్యాన్స్ థియేటర్ వైపు ప్రేక్షకులు క్యూ కట్టెలాగా చేసాయి..ఇక ఈరోజు ఆమె హీరోయిన్ గా నటించిన ‘ధమాకా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.

    రవితేజ హీరో గా నటించిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణాలలో ఒకరు శ్రీలీల..ఈమె వేసిన డ్యాన్స్ స్టెప్పులకు థియేటర్స్ దద్దరిల్లిపోయాయి..ఆమె డ్యాన్స్ స్పీడ్ చూస్తుంటే ఈమె ముందు ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ వంటి డ్యాన్సర్లు కూడా నిలుస్తారా లేదా అనే సందేహం రాక మానదు..వాళ్ళు కూడా ఈమెతో ఒకవేళ సినిమా చెయ్యాల్సి వస్తే ఈమె పక్కన డ్యాన్స్ వేసే సమయం లో కాస్త ఆచి తూచి నడుచుకుంటారు..భవిష్యత్తులో ఈమె కేవలం టాలీవుడ్ ని మాత్రమే కాదు..పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

    ప్రస్తుతం ఈమె రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ చెయ్యడానికి ఒప్పుకుంది..వాటిల్లో ఒకటి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కాగా..మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ..బాలయ్య బాబు సినిమాలో బాలకృష్ణ కి కూతురు గా నటిస్తున్న శ్రీలీల , మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది..ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే ఇక శ్రీలీల వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.