krishna- Mosagallaku Mosagadu: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మూలస్తంబాలలో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ గారు నేడు తన తుది శ్వాసని విడిచిన ఘటన యావత్తు తెలుగు ప్రజలను, సినీ ఇండస్ట్రీ ని శోకసంద్రం లోకి నెట్టేశాయి..నటుడిగా నిర్మాతగా ఆయన సినీ ప్రస్థానం సువర్ణాక్షరాలితో లిఖించదగినది..అలాంటి డేరింగ్ & డాషింగ్ ఉన్న హీరో..అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి మళ్ళీ పుట్టడం అసాధ్యమే..ఆయన లేని లోటు ఎవ్వరు పూడవలేనిది.

రికార్డ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినా కృష్ణ గారు మన ఇండస్ట్రీ కి పరిచయం చేసిన టెక్నాలజీ మరియు ఫిలిం జానర్స్ ఇప్పటి వరుకు ఏ హీరో కూడా చెయ్యలేదు..బాహుబలి, కేజీఎఫ్ మరియు #RRR వంటి సినిమాలకు కూడా సాద్యమపడని అరుదైన రికార్డుని కృష్ణ గారి సినిమా ఒకటి నెలకొల్పిందని అభిమానులకు కూడా చాలా మందికి తెలియదు..ఆ సినిమా మరేమిటో కాదు..కృష్ణ గారి కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన ‘మోసగాళ్ళకి మోసగాడు’ అనే చిత్రం.
సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే కాదు..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే మొట్టమొదటి కౌ బాయ్ చిత్రమది..హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ‘మేకనస్ గోల్డ్’ అనే సినిమా కృష్ణ గారికి అప్పట్లో తెగ నచ్చేసింది..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది..అప్పటికే మన టాలీవుడ్ ప్రేక్షకులు జాపపడ పౌరాణిక సినిమాలకు బాగా అలవాటుపడి విసుగు చెందారు..అలాంటి సమయం లో ఇలాంటి కొత్తతరహా సినిమాని ప్రేక్షకులకు అందిస్తే వాళ్లకి అద్భుతమైన అనుభూతి కలుగుతుందని కృష్ణగారు భావించి ప్రముఖ రచయితా మరియు దర్శకులైన ఆరుద్ర గారిని ఆ తరహా జానర్ లో ఒక సినిమాని తెలుగు నేటివిటీ కి తగ్గట్టుగా చేద్దాం..కథ రాయమని చెప్పారు.
కృష్ణ గారి సలహాలన్నీ తీసుకొని ఆరుద్ర గారు కథ సిద్ధం చేసాడు..అలా ప్రారంభమైన ఈ సినిమా 8 లక్షల రూపాయిల బడ్జెట్ తో కేవలం 28 రోజుల్లో షూటింగ్ ని పూర్తి చేసుకుంది..కేవలం 35 సెంటర్స్ లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించడంతో హిందీ మరియు తమిళ బాషలలో విడుదల చేసారు..అక్కడ కూడా పెద్ద హిట్ అయ్యింది..ఆ తర్వాత ఇంగ్లీష్ లో ‘ట్రెజర్ హంట్’ అనే పేరు తో విడుదల చేసారు..అక్కడ కూడా సంచలన విజయం సాధించింది.

ఆ తర్వాత ఈ చిత్రాన్ని ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలలో ..అన్ని బాషలలో అనువదించి విడుదల చేసారు..ఇప్పటికి ఈ రికార్డు ని ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయారు..కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమాకి అప్పట్లో 50 లక్షల గ్రాస్ వచ్చింది..ఇక అన్ని దేశాల కలెక్షన్స్ ని లెక్కగడితే 5 కోట్ల రూపాయిల గ్రాస్ ఉంటుంది..ఇప్పుడు బాహుబలి కలెక్షన్స్ ఎలా అనితరసాధ్యమైన కలెక్షన్స్ గా నిలిచిందో అప్పట్లో మోసగాళ్లకు మోసగాడు చిత్రం అలా అన్నమాట..అలా కృష్ణ గారి కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచినా ఈ చిత్రం రికార్డ్స్ ఇప్పటికి అన్ బీటబుల్ గా నిలిచింది.