
Bangaram Movie Child Artist: సినిమాల్లో చిన్న నాటి పాత్రల కోసం వచ్చిన వారు హీరోయిన్లుగా అయినవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి కోవలో అలనాటి అందాల నటి శ్రీదేవి కూడా ఒకరు. శ్రీదేవి, మీనా, రాశి ఇలా చెప్పుకుంటూ పోతే బాల్య నటులుగా వచ్చి అందాల తారలుగా ఎదిగిన వారు ఎందరో ఉండటం గమనార్హం. అలా వారి సినీరంగ ప్రవేశం జరిగినా తరువాత కాలంలో హీరోయిన్లుగా కూడా తమ తలరాతను పరీక్షించుకోవడం సహజం.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా బంగారం. ఈ సినిమాలో హీరోయిన్ చెల్లెలి పాత్రలో నటించి మెప్పించిన సనూష సంతోష్. ఆమె అప్పటికే మలయాళంలో ఇరవైకిపైగా సినిమాల్లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. బాలనటిగా రెండు మూడు సినిమాలకు జాతీయ అవార్డులు సైతం అందుకుంది. ఈ నేపథ్యంలో బంగారం సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఆమె ఇప్పుడు హీరోయిన్ గా మారి కొన్ని సినిమాలు చేసింది. 2012లో మిస్టర్ మురుగన్ సినిమాతో హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసింది. తెలుగులో కూడా రేణికుంట జీనియస్ అనే సినిమాలో కనిపించింది. తరువాత నాని సినిమా జెర్సీలో కూడా జర్నలిస్ట్ పాత్రలో మెరిసింది. ఇలా తెలుగులో కూడా తన నటనతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కరోనా సమయంలో డిప్రెషన్ తో మానసిక వైద్యుడిని కలుసుకుని చికిత్స తీసుకుంది.

చిన్ననాటి తారలు మన తెరలో కనిపించడం మామూలే. అందరు ఏదో ఒక సమయంలో తమ కెరీర్ ను ప్రారంభించిన వారే. కాకపోతే కడదాకా నిలబడే వారు కొందరైతే మధ్యలోనే నిష్ర్రమించే వారు మరికొందరు. ఇలా సనూష సంతోష్ కూడా తన ప్రస్థానాన్ని తెలుగులో మళ్లీ ఆరంభించాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఆమె నటనను మరోసారి ఆస్వాదించాలని చూస్తున్నారు.