Krishna- Mahesh Babu Combination: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి నేడు బ్లాక్ డే..సాహసాలకు మారుపేరు..తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన మహానుభావుడు..కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనే పదానికి ఇండస్ట్రీ లో పర్యాయపదం లాంటి కృష్ణ గారు మొన్న గుండెపోటుతో ఆసుపత్రి లో చేరాడు..ICU లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం నాలుగు గంటల 9 నిమిషాలకు ఆయన కాలం చెందారు..తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో తన ప్రస్థానం ని లిఖించిన కృష్ణ గారి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.
తండ్రి కీర్తి ప్రతిష్టలను నేటి తరం వారికి కూడా చాటిచెప్పాడు..తన తండ్రి అంటే మహేష్ బాబు కి ప్రాణం..ఆరాధ్య దైవం లా అతనిని కొలుస్తాడు..తనకి జీవితాన్ని ఇచ్చిన అలాంటి తండ్రి నేడు లేకపోవడం మహేష్ బాబు కి ఎలాంటి దుఃఖం కలిగించి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు..ఒకే ఏడాది లో నెలల గ్యాప్ లో అన్నయ్య రమేష్ బాబు..తల్లి ఇందిరా దేవి గారు..ఇప్పుడు కృష్ణ గారు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు మహేష్ ని వీడి వెళ్లడం ని చూస్తుంటే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పుకోలేము.
సూపర్ స్టార్ కృష్ణ గారు మరియు మహేష్ బాబు గారు కలిసి ఇప్పటి వరుకు పది సినిమాల్లో నటించారు..మురళి మోహన్ గారు హీరో గా దాసరి నారాయణరావు గారి దర్శకత్వం లో తెరకెక్కిన ‘నీడ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి బాలనటుడిగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు..ఆ తర్వాత కృష్ణ గారితో కలిసి ఆయన బాలనటుడిగా గూఢచారి 117 , అన్న తమ్ముడు , కొడుకు దిద్దిన కాపురం,ముగ్గురు కొడుకులు ,బజారు రౌడీ, శంఖారావం, పోరాటం వంటి సినిమాల్లో నటించారు.
ఈ సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి..ఇక ఆ తర్వాత మహేష్ బాబు హీరో గా మారినతర్వాత కృష్ణ గారితో కలిసి చేసిన రాజ కుమారుడు , వంశి మరియు టక్కరి దొంగ వంటి సినిమాలలో రాజకుమారుడు సూపర్ హిట్ గా నిలబడగా..మిగిలిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచాయి..కృష్ణ గారితో మొత్తం పది సినిమాలు మహేష్ బాబు చేస్తే అందులో 8 సినిమాలు సక్సెస్ సాధించాలి..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో తండ్రి కొడుకుల కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ ఇంత సక్సెస్ రేషియో ఏ కాంబినేషన్ కి లేదనే చెప్పాలి..అలాంటి అరుదైన ఘనత సాధించింది కృష్ణ – మహేష్ కాంబినేషన్.