Director Teja- Uday Kiran: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ధ్రువతార లాగ దూసుకొచ్చి నేలకొరిగిన యువ హీరో ఉదయ్ కిరణ్..2000 దశాబ్ద ప్రారంభం లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి, యువతని ఊపేసే చిత్రం , నువ్వు నేను మరియు మనసంతా నువ్వే లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి స్టార్ హీరోలకే పోటీని ఇచ్చిన ఈ యువ హీరో,ఆ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ లోపం వల్ల వరుస ఫ్లాపులు ఎదురుకొని ఎంత తొందరగా గా ఎదిగాడో అంతే తొందరగా ఫేడ్ అవుట్ అయ్యాడు.

ఉదయ్ కిరణ్ మంచితనం, ఎదుగుదల చూసి మెగాస్టార్ చిరంజీవి లాంటి వాడే తన పెద్ద కూతురుని ఇచ్చి వివాహం చెయ్యాలనుకున్నాడు..నిశ్చితార్థం కూడా చేసాడు..కానీ చివరి నిమిషం లో మీ అమ్మాయికి నాకు సెట్ అవదండి అని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు ఉదయ్ కిరణ్..అయితే అప్పటి నుండి చిరంజీవి ఉదయ్ కిరణ్ ని కావాలని టార్గెట్ చేసాడని..ఉదయకిరణ్ కి ఫిలిం కెరీర్ లేకుండా తొక్కేసాడని పచ్చ మీడియా ఆయన పై విష ప్రచారం చేసింది.

అయితే ఉదయ్ కిరణ్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన దర్శకుడు తేజ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో దీని పై సంచలన వ్యాఖ్యలు చేసాడు..చిరంజీవి ఉదయకిరణ్ కెరీర్ ని నాశనం చేసారని అందరూ అంటూ ఉంటారు..ఇది నిజమేనా అని ఆ యాంకర్ అడిగిన ప్రశాంత్ కి తేజా సమాధానం చెప్తూ ‘ముమ్మాటికీ కాదు..ఉదయకిరణ్ చనిపోయే ముందు నాతో కాల్ లో జరిగిన విషయం మొత్తం చెప్పాడు..అతను ఎవరి వల్ల అంత మానసిక క్షోభకి గురయ్యాడో..ఎవరు అతని కెరీర్ ని తొక్కాలని చూస్తున్నాడో మొత్తం చెప్పాడు..నేను అతనికి ధైర్యం చెప్పను..ఉదయ్ కిరణ్ సున్నిత మనస్కుడు అనే విషయం తెలుసు కానీ..మరీ ఆత్మహత్య చేసుకునేంత సున్నితం అని నాకు తెలియదు..నేను చనిపోయేలోపు ఉదయకిరణ్ ఆత్మహత్య కి కారణం ఎవరో చెప్తాను’ అంటూ తేజా ఎమోషనల్ గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది..ఇంతకీ ఎవరు ఉదయకిరణ్ మీద పగబట్టిన ఆ మనిషి అని నెటిజెన్స్ సోదాలు చెయ్యడం ప్రారంభించారు.