MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. అక్టోబర్ 10 జరిగే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం సినీ ప్రముఖులు ఎంతకైనా దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య ప్రస్తుతం హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ రెండు వర్గాల మాటల యుద్ధంతో రచ్చ చేస్తున్నాయి. మరో మూడు రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా గెలవడానికి చేయని ప్రయత్నాలు లేవంటే అతిశయోక్తి కాదు..
ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయిన సినీ పరిశ్రమలోని ఆర్టిస్టులు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ‘మా’ ఎన్నికలపై వరుసగా స్పందిస్తూ ఇండస్ట్రీ లొసుగులు అన్నీ బయటపెడుతున్నారు. అవి కాస్త సంచలనమవుతున్నాయి. ఇప్పటికే నటుడు , దర్శకుడు రవిబాబు, రాజీవ్ కనకాల సహా ఇతర ప్రముఖులు తమ వారికే ఓటు వేయాలని నాన్ లోకల్ సమస్యను తీసుకొస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి చేసిన ట్వీట్ సంచలనమైంది. ‘మా’ ఎన్నికల్లో తనకు నచ్చిన ప్యానెల్ సభ్యులకు మద్దతిస్తేనే వారికే తదుపరి తన సినిమాల్లో క్యారెక్టర్లు రాస్తానంటూ ఆయన చెప్పినట్లు అజయ్ భూపతి పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
మరోవైపు అక్టోబర్ 10న జరుగనున్న ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని అటు ప్రకాష్ రాజ్, ఇటు మంచు విష్ణు వదలడం లేదు. తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘ఓటుకు నోటు’ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది.
నాకు నచ్చిన ప్యానల్ కి మద్దతిచ్చిన వారికే క్యారెక్టర్లు రాస్తా…
(అని నాతో ఇప్పుడే ఒక డైరెక్టర్ అన్నాడు)#MAAElections
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 6, 2021