https://oktelugu.com/

Inaya Elimination : ఇనాయా ఎలిమినేషన్ వెనుక ఇంత మోసం జరిగిందా.. మండిపడుతున్న ఫ్యాన్స్

Inaya Elimination : బిగ్ బాస్ సీజన్ 6 లో బ్లండర్ మిస్టేక్స్ జరుగుతూనే ఉన్నాయి..ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయం లో బిగ్ బాస్ టీం చాలా అన్యాయంగా వ్యవహరిస్తోంది..అందుకే ఈ షో ని వీక్షించే వారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతూ వస్తుంది..బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ ని బయటకి నెట్టేయడమే ఈ సీజన్ యొక్క ముఖ్య లక్ష్యమా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఇనాయ ని ఎలిమినేట్ చెయ్యడం నిజంగా అనైతికం […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2022 / 08:38 AM IST
    Follow us on

    Inaya Elimination : బిగ్ బాస్ సీజన్ 6 లో బ్లండర్ మిస్టేక్స్ జరుగుతూనే ఉన్నాయి..ముఖ్యంగా ఎలిమినేషన్స్ విషయం లో బిగ్ బాస్ టీం చాలా అన్యాయంగా వ్యవహరిస్తోంది..అందుకే ఈ షో ని వీక్షించే వారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతూ వస్తుంది..బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ ని బయటకి నెట్టేయడమే ఈ సీజన్ యొక్క ముఖ్య లక్ష్యమా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఇనాయ ని ఎలిమినేట్ చెయ్యడం నిజంగా అనైతికం అని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున బిగ్ బాస్ టీం పై నెగటివ్ ట్రెండ్ చేస్తున్నారు నెటిజెన్స్.

    ఓటింగ్ లైన్ లో టాప్ 2 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న ఇనాయ ఎలిమినేట్ అవ్వడం ఏంటి..మ్యానేజ్మెంట్ కోటాలో వచ్చిన కంటెస్టెంట్స్ ని సేఫ్ చేసేందుకే ఈ సీజన్ ని నడుపుతున్నారా అంటూ చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి..కానీ బిగ్ బాస్ టీం సోషల్ మీడియా లో వస్తున్న ఈ నెగటివిటీ ని ఏ మాత్రం కూడా లెక్క చెయ్యడం లేదు.

    గత సీజన్స్ లో ఎలిమినేషన్స్ సోషల్ మీడియా లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్ లో ఎవరికీ తక్కువ ఓట్లు వచ్చేవో వాళ్ళు ఎలిమినేట్ అయిపొయ్యేవాళ్ళు..కానీ ఈ సీజన్ మాత్రం అందుకు పూర్తిగా బిన్నంగా సాగుతుంది..అప్పటికి ఇప్పటికి అంత మార్పు ఎందుకు..?, బాటమ్ టాప్ 2 లిస్ట్ లో ఉన్న ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యారంటే ఒక అర్థం ఉంది..కానీ టాప్ 2 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగుతున్న వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారా..??, ఇంత తేడా ఈ సీజన్ లోనే ఎందుకు జరుగుతుంది..?.

    ఈ ప్రశ్నలకు బిగ్ బాస్ టీం సమాధానం చెప్పగలదా..? ధైర్యం గా ఓట్ల డేటా ని ప్రేక్షకులకు లైవ్ గా చూపించగలరా..? ఒకవేళ చూపించకపోతే మాత్రం ఇది బిగ్ బాస్ తదుపరి సీజన్స్ పైన కూడా ప్రభావం చూపించే అవకాశం కచ్చితంగా ఉంది..ఎందుకంటే ప్రేక్షకుల ఓట్లని లెక్క చెయ్యకుండా బిగ్ బాస్ కి ఇష్టమొచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ పోతే ఇక ఈ షో చూడడం ఎందుకు అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.