Raviteja Ravanasura : ‘ధమాకా’ మరియు ‘వాల్తేరు వీరయ్య’ వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రావణాసుర’.ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా కి సంబంధించిన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకొని మూవీ పై అంచనాలు పెంచేలా చేసాయి.ముఖ్యంగా ట్రైలర్ చూసిన తర్వాత ఒక సరికొత్త సినిమాని చూడబోతున్నామనే ఫీలింగ్ వచ్చింది.
రవితేజ తన కెరీర్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నాడనే సంకేతాలను ఇచ్చింది ఈ చిత్రం.అయితే ఈ సినిమా రీసెంట్ గానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ ఇస్తారని మూవీ టీం ఆశించింది.కానీ వాళ్ళ అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రానికి A సర్టిఫికెట్ ఇచ్చింది.ఇదే ఇప్పుడు మూవీ టీం ని ఆందోళనకి గురి చేస్తున్న విషయం.
విపరీతమైన వయోలెన్స్ మరియు బూతులు ఉంటే తప్ప సెన్సార్ బోర్డు ఇలా A సర్టిఫికెట్ ఇవ్వదు.అలాంటిది ఈ చిత్రానికి ఆ సర్టిఫికెట్ ఇచ్చింది అంటే మూవీ లో అంత హింస ఉందా? అని అనుకుంటున్నారు అభిమానులు.A సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు మల్టిప్లెక్స్ లలో 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎంట్రీ లేదనే విషయం మన అందరికీ తెలిసిందే,అలా ఈ సినిమా విడుదలకి ముందే నష్టాన్ని చూడాల్సి వచ్చింది.ట్రైలర్ చూసినప్పుడు కూడా ఇది కేవలం రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న సినిమాలాగానే అనిపించింది కానీ, సెన్సార్ బోర్డు ఇచ్చినట్టు గా A సర్టిఫికెట్ సన్నివేశాలు కనిపించలేదు.
ఇకపోతే ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని, రవితేజ ఖాతాలో మరో సూపర్ హిట్ గా నిలవబోతుందని సెన్సరో సభ్యులు రివ్యూ ఇచ్చారట.మరి వాళ్ళు ఇచ్చిన రివ్యూ ప్రకారం ఈ సినిమా రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలుస్తుందా లేదా ఫ్లాప్ అవుతుందా అనేది తెలియాలంటే ఏప్రిల్ 7 వరకు ఆగాల్సిందే.