https://oktelugu.com/

Balakrishna Tejaswini : ఆమె లేకపోతే బాలయ్య కెరీర్ సర్వనాశనం అయ్యేదా..? బయటపడ్డ షాకింగ్ నిజం

Balakrishna Tejaswini : ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని..మాస్ అంటే నేనే అనే రేంజ్ ఇమేజి ని తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే అని చెప్పొచ్చు..ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయన సృష్టించిన ప్రభంజనం మామూలువి కాదు..బాలయ్య హిట్ కొట్టాడంటే ఇండస్ట్రీ రికార్డ్స్ చెదిరిపోవాల్సిందే..ఆ రేంజ్ లో ఆయన తన ప్రభావం ని చూపించాడు..అయితే మధ్యలో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2023 / 10:00 AM IST
    Follow us on

    Balakrishna Tejaswini : ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని..మాస్ అంటే నేనే అనే రేంజ్ ఇమేజి ని తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది నందమూరి బాలకృష్ణ మాత్రమే అని చెప్పొచ్చు..ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయన సృష్టించిన ప్రభంజనం మామూలువి కాదు..బాలయ్య హిట్ కొట్టాడంటే ఇండస్ట్రీ రికార్డ్స్ చెదిరిపోవాల్సిందే..ఆ రేంజ్ లో ఆయన తన ప్రభావం ని చూపించాడు..అయితే మధ్యలో బాలయ్య బాబు చాలా చెత్త సినిమాలు చేసాడు.

    అందువల్ల ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా పూర్తిగా మసకబారింది..నాసిరకపు డైరెక్టర్స్ తో , నాసిరకం సినిమాలు చేసి తన ఇమేజి మొత్తాన్ని ఒక దశలో పోగొట్టుకున్నాడు బాలయ్య బాబు..అభిమానులు కూడా ఏంటి ఈయన ఇలా అయిపోయాడు అని బాధపడేవాళ్లు..ఆయన సినిమాలను థియేటర్స్ లో చూడడం కూడా మానేశారు.. అఖండ సినిమాకి ముందు బాలయ్య కెరీర్ లో అన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్..అఖండ కి ముందు ఆయన చేసిన రూలర్ సినిమా పది కోట్ల రూపాయిల షేర్ ని కూడా వసూలు చెయ్యలేకపోయింది.

    అది నందమూరి అభిమానులకు చాలా అవమానకరంగా అనిపించింది..ఇక బాలయ్య కెరీర్ ముగిసినట్టే అని అందరూ ఫిక్స్ అయిపోయారు..సరిగ్గా అలాంటి సమయంలోనే అఖండ చిత్రం బాలయ్య కి కొత్త ఊపిరి పోసింది..ఇక ఆ తర్వాత ఆహా మీడియా లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో బాలయ్య కెరీర్ ని మలుపు తిప్పింది..ఇక ఆ తర్వాత ఆయన సెట్ చేసుకున్న కాంబినేషన్స్ కూడా చాలా క్రేజీ ఉన్నాయి..గోపీచంద్ మలినేని తో చేసిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం విడుదలకి సిద్ధం గా ఉంది..ఈ సినిమా తర్వాత వెంటనే ఆయన అనిల్ రావిపూడి తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..ఈ రెండు సినిమాల తర్వాత కొరటాల శివ తో కూడా ఒక సినిమా ఫిక్స్ అయ్యింది.

    ఇలా ఈ క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవ్వడానికి కారణం బాలయ్య చిన్న కూతురు తేజస్విని అట.. ఆమె అధ్వర్యం లోనే బాలయ్య బాబు కెరీర్ ప్రస్తుతం నడుస్తోంది.. ‘అన్ స్టాపబుల్’ షోకి కూడా క్రియేటివ్ హెడ్ ఆమెనే అట.. ఇలా బాలయ్యకి సంబంధించినవి అన్నీ తేజస్విని దగ్గరుండి మరీ చూసుకుంటుంది.. అలా ఆమె కల్పించుకొని ఉండక పొయ్యుంటే బాలయ్య కెరీర్ రూలర్ సినిమాతోనే ముగిసిపోయేదని అభిమానులు అనుకుంటున్నారు.