Pawan Kalyan NBK : ఇటీవలే విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ పార్ట్ 1 కి ఎంతతి సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఇప్పటి వరకు జరిగిన రెండు సీజన్స్ లో ఈ ఎపిసోడ్ కి వచ్చినంత వ్యూస్ ఏ ఎపిసోడ్ కి రాలేదని ఆహా మీడియా వారు అధికారికంగా తెలిపారు.ఇక రెండవ పార్ట్ ఈ నెల పదవ తారీఖున విడుదల చెయ్యబోతున్న సందర్భంగా ఈరోజు ఒక ప్రోమో ని విడుదల చేసారు.
ఈ ప్రోమో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది అభిమానుల అభిప్రాయం ఏమిటంటే ఈరోజు విడుదల చేసిన ప్రోమో,ఎపిసోడ్ పార్ట్ 1 కంటే గొప్పగా ఉందని, మేము ఎలాంటి ప్రశ్నలు అయితే అడగాలి అనుకున్నామో , ఆ ప్రశ్నలన్నింటినీ బాలయ్య చేత అడిగించినందుకు ఆహా మీడియా కి కృతఙ్ఞతలు అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ వేస్తున్నారు.
ఈ ప్రోమో ప్రారంభం బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ మీద జోక్స్ వేస్తాడు..పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ కి ఒక హుడి వేసుకొచ్చిన సంగతి తెల్సిందే..ఈ హుడి కి రెండు పెద్ద జోబులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఆ జోబీలో చేతులు పెట్టుకోవడం మనం గమనించే ఉంటాము, దీని పై బాలయ్య మాట్లాడుతూ ‘ఆ జేబీలో చేతులు ఏంటి..తియ్యి’ అంటాడు, అప్పుడు పవన్ కళ్యాణ్ నవ్వుతూ జోబులోనుండి చేతులు తీస్తాడు..అప్పుడు బాలయ్య మాట్లాడుతూ ‘నువ్వు జోబులో చేతులు పెట్టుకున్నది ఎవరినీ కొట్టకుండా ఉండేందుకు లాగ అనిపిస్తుంది’ అని జోక్ వేస్తాడు.
అలా కాస్త ఫన్ మరియు సీరియస్ తో ఈ ఎపిసోడ్ మొత్తం సాగిపోనుంది.ఆహా మీడియా వారు చెప్తున్నది ఏమిటంటే పార్ట్ 1 కేవలం టీజర్ మాత్రమే, అసలు సినిమా మొత్తం పార్ట్ 2 లో ఉంది , రికార్డ్స్ మొత్తం మరోసారి బ్లాస్ట్ అవుతాయి అని ధీమా తో చెప్పారు..మరి వారి అంచనాలను ఈ ఎపిసోడ్ అందుకుంటుందో లేదో చూడాలి.