Balagam Trailer : బలగం.. నిర్మిస్తోంది దిల్ రాజు. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి కాసర్ల శ్యామ్ ఒక పాట రాశాడు.. పాడింది మిర్యాల రామ్.. మంగ్లీ. పాట వింటుంటే తెలంగాణ మాండలికాన్ని చేతితో తడిమినట్టు ఉంది.. ఈ పాటకు మంగ్లీ గొంతు సరిపోలేదు.. ఈ పాటకు సంగీత దర్శకుడు భీమ్స్. తను కూడా తెలంగాణ వాడే.
తెలంగాణ నేపథ్యం కథతోనే వేణు బలగం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ యజమాని, నిర్మాత దిల్ రాజు బొమ్మరిల్లు, శతమానం భవతి సినిమాల్లా బలగం సినిమా కూడా బ్యానర్‌కు మంచిపేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. వినోదం, భావోద్వేగం కలగలిపిన ఈ సినిమాతో నిర్మితలుగా మారిన హర్షిత్, హన్షితలకు ఈ సినిమా శుభారంభాన్నిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వేణు అనే సినిమాల్లో నటించారు. టీవీ షోల ద్వారా కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బలగం సినిమాతో దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా వేణు ప్రతిభను ఆవిష్కరించే చిత్రం అవుతుందని హీరో ప్రియదర్శి ధీమాగా చెబుతున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్ పొందిది.
తాజాగా బలగం మూవీ ట్రైలర్ విడుదలైంది. అచ్చ తెలంగాణ మాండలికంలో.. తెలంగాణ యాస, భాషతో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్‌సహా ప్రతీ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాలో కుటుంబం బంధాలు, అప్పులు, బలం బలగం లేకపోతే ఎలాంటి కష్టాలు ఎదురవుతాయన్నది కళ్లకు కట్టినట్టు చూపించారు.
సినిమాలో హీరో తాత పాత్రలో నటించిన సుధాకర్ రెడ్డి , హీరో తండ్రి పాత్రలో నటించిన జయరాం, అలాగే నారాయణ పాత్రలో మురళీధర్, హీరో మేనత్త పాత్రలో విజయలక్ష్మి, హీరో తల్లి పాత్రలో స్వరూప, హీరో బాబాయ్ పాత్రలో మొగిలి ఇలా పాత్రలన్నీ మనకు గుర్తుండిపోతాయి. అలా అచ్చంగా రాశారు.
తెలంగాణ పల్లె కథతో తీసిన సినిమా మరి ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటోందో.. దర్శకుడిగా వేణు ప్రతిభకు రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియాలంటే మార్చి 3 వరకు ఆగాల్సిందే.
ట్రైలర్ ను పైన చూడొచ్చు.