https://oktelugu.com/

‘Balagam’ Movie Bookings : ‘బలగం’ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అంత వసూళ్లను రాబట్టిందా..? దిల్ రాజు అదృష్టం మామూలుగా లేదుగా!

‘Balagam’ Movie Bookings : ఎలాంటి సినిమాకి అయినా బజ్ తీసుకొని రావడం లో కొంతమంది బ్రాండ్ ఇమేజి చాలా వర్కౌట్ అవ్వుధి.అలాంటి బ్రాండ్ ఇమేజి ఉన్నోళ్లలో ఒకడు దిల్ రాజు.ఈయన బ్యానర్ నుండి ఒక సినిమా విడుదల అవుతుంది అంటే బయ్యర్లు కళ్ళు మూసుకొని కొనేస్తారు.అలాంటి బ్రాండ్ ఇమేజి అందరికీ సాధ్యం కాదు.ఇప్పుడు ఆయన బ్యానర్ నుండి రేపు విడుదల అవ్వబోతున్న ‘బలగం’ మూవీ కి కూడా దిల్ రాజు బ్రాండ్ ఇమేజి బాగా ఉపయోగపడింది. దానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2023 / 08:43 PM IST
    Follow us on

    ‘Balagam’ Movie Bookings : ఎలాంటి సినిమాకి అయినా బజ్ తీసుకొని రావడం లో కొంతమంది బ్రాండ్ ఇమేజి చాలా వర్కౌట్ అవ్వుధి.అలాంటి బ్రాండ్ ఇమేజి ఉన్నోళ్లలో ఒకడు దిల్ రాజు.ఈయన బ్యానర్ నుండి ఒక సినిమా విడుదల అవుతుంది అంటే బయ్యర్లు కళ్ళు మూసుకొని కొనేస్తారు.అలాంటి బ్రాండ్ ఇమేజి అందరికీ సాధ్యం కాదు.ఇప్పుడు ఆయన బ్యానర్ నుండి రేపు విడుదల అవ్వబోతున్న ‘బలగం’ మూవీ కి కూడా దిల్ రాజు బ్రాండ్ ఇమేజి బాగా ఉపయోగపడింది.

    దానికి తోడు ఈ చిత్రం ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి పలు ప్రాంతాలలో పైడ్ ప్రీమియర్ షోస్ ని ప్రదర్శించారు.ఈ షోస్ నుండి సినిమాకి బంపర్ రెస్పాన్స్ వచ్చింది.ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ వేణు టిల్లు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.తెలంగాణ లోని ఒక చిన్న పల్లెటూరులో జరిగే కథని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమా కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం తో ఉంది మూవీ టీం.

    అలా మెల్లగా బజ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి.ముఖ్యంగా నైజం ప్రాంతం లో చాలా చోట్ల ఒక మీడియం రేంజ్ హీరో కి ఎలాంటి బుకింగ్స్ జరుగుతాయో, అలాంటి బుకింగ్స్ ఈ సినిమాకి కూడా జరిగింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు జరగగా, టాక్ వస్తే కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ కే చేరుకుంటుంది అని అంటున్నారు విశ్లేషకులు.

    ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని చూస్తూ ఉంటే మొదటి రోజు టాక్ వస్తే కేవలం నైజాం ప్రాంతం నుండే కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వస్తాయట.మరి ప్రివ్యూ షోస్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా  రెగ్యులర్ షోస్ నుండి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుంటుందా లేదా అనేది చూడాలి.