Site icon OkTelugu

Rajamouli: రాజమౌళి ఖాతాలో మరో అరుదైన విజయం… ఆ గౌరవం అందుకున్న ఏకైక ఇండియన్ డైరెక్టర్!

Rajamouli
Rajamouli

Rajamouli: దర్శకుడు రాజమౌళి విజయయాత్ర కొనసాగుతుంది. ఆయన మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ప్రఖ్యాత మ్యాగజైన్ టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన ప్రముఖుల లిస్ట్ లో ఆయనకు స్థానం దక్కింది. టైమ్స్ మ్యాగజైన్ ది మోస్ట్ ఇన్ఫ్లుఎన్షియల్ పీపుల్ ఆఫ్ 2023 ప్రకటించింది. ఇందులో రాజమౌళికి స్థానం దక్కింది. ఈ గౌరవం అందుకున్న ఏకైక ఇండియన్ ఫిల్మ్ మేకర్ గా ఆయన రికార్డులకు ఎక్కారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది.

పలు అంతర్జాతీయ అవార్డులను ఆర్ ఆర్ ఆర్ సొంతం చేసుకుంది. రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్స్ అందుకుంది. నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్స్ సొంత చేసుకున్న విషయం తెలిసిందే. అమెరికా, జపాన్ దేశాల్లో ఆర్ ఆర్ ఆర్ భారీ ఆదరణ దక్కించుకుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని దర్శక దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ మెచ్చుకున్నారు.

ఈ క్రమంలో రాజమోళి టైమ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. రాజమౌళికి దక్కిన ఈ పురస్కారాన్ని అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చిత్ర ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. రెండు కల్పిత పాత్రల ఆధారంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిసి బ్రిటిష్ వారిపై పోరాడితే ఎలా ఉంటుందనే కోణంలో చెప్పారు.

Rajamouli

స్నేహం, లక్ష్యం మధ్య సంఘర్షణ రాసుకొని విజువల్ వండర్ తెరకెక్కించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో వారు కూడా గ్లోబల్ స్టార్స్ అయ్యారు. ప్రపంచ సినిమా వేదికలపై వారికి విశిష్ట గౌరవాలు దక్కాయి. త్వరలో ఈ ఇద్దరు ఆర్ ఆర్ ఆర్ స్టార్స్ హాలీవుడ్ చిత్రాల్లో హీరోలుగా నటించే అవకాశం కలదు.

మరోవైపు రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్నారు. మహేష్ బాబుతో ప్రకటించిన ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబర్ నుండి షూటింగ్ జరగనుందనే ప్రచారం జరుగుతుంది. రాజమౌళి అత్యంత భారీగా మహేష్ మూవీ ప్లాన్ చేస్తున్నారట. మూడు భాగాలుగా రూ. 2000 కోట్ల బడ్జెట్ తో రూపొందించనున్నారట. జంగిల్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ పాత్రకు హనుమంతుడు అని మేకర్స్ చెప్పడం విశేషం.

Exit mobile version