Rahmanullah Gurbaz: అర్ధరాత్రి అహ్మదాబాద్ లో గొప్ప మనసు చాటుకున్న అప్ఘన్ క్రికెటర్.. దీపావళి పూట ప్రశంసల జల్లు

అప్ఘానిస్థాన్‌ ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ మంచి మనసు చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో చివరి లీగ్‌ మ్యాచ్‌ ముగిశాక తెల్లవారుజామున 3 గంటల సమయంలో అహ్మదాాబాద్‌ రోడ్లపైకి వెళ్లిన గుర్బాజ్‌..

Written By: Raj Shekar, Updated On : November 13, 2023 12:50 pm
Follow us on

Rahmanullah Gurbaz: ఆఫ్ఘనిస్తాన్‌.. నిత్యం సమస్యలతో సతమతం అవుతున్న దేశం. ఉగ్రవాదులు పాలిస్తున దేశం నుంచి అక్కడి ఆటగాళ్లు క్రికెట్‌ వరల్డ్‌ కప్‌కు క్వాలీఫై అయ్యారు. ఆ పేద దేశం నుంచి వచ్చినవారు ఏం ఆడతారులే అని అంతా భావించారు. కానీ, పెద్ద జట్లనే చిత్తు చేసింది. పాయింట్ల పట్టికలో గత చాంపియన్‌ ఇంగ్లడ్, శ్రీలంకతోపాటు, బంగ్లాదేశ్, నెదర్లాండ్‌ కన్నా ముందు వరుసలో నిలిచింది. సెమీస్‌కు క్వాలీఫై అయ్యే అవకాశాన్ని కొద్దిలో మిస్‌ చేసుకుని క్రికెట్‌ అభిమానుల మనసు దోచుకున్నారు ఆఫ్ఘాన్‌ క్రికెటర్లు.. అంతేకాదు, తాజాగా భారతీయుల హృదయాలను కొల్లగొట్టారు. తమది పేద దేశమే అయినా.. ఉత్నంతో సాయం చేయాలని భారత్‌తో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న పేదలకు దీపావళి కానుకలు అందించి గొప్ప మనసు చాటుకున్నారు.

అహ్మదాబాద్‌లో..
అప్ఘానిస్థాన్‌ ఓపెనర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ మంచి మనసు చాటుకున్నాడు. సౌతాఫ్రికాతో చివరి లీగ్‌ మ్యాచ్‌ ముగిశాక తెల్లవారుజామున 3 గంటల సమయంలో అహ్మదాాబాద్‌ రోడ్లపైకి వెళ్లిన గుర్బాజ్‌.. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌ మీద నిద్రిస్తున్న వారి దగ్గర డబ్బులు ఉంచాడు. వారంతా గాఢ నిద్రలో ఉండగా.. సైలెంట్‌గా అక్కడికి వెళ్లిన గుర్బాజ్‌ రూ.500 నోట్లను వారి పక్కన ఉంచి అక్కడి నుంచి వచ్చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటతోనే కాకుండా ప్రవర్తనతోనూ అభిమానుల హృదయాలను గెలిచారు. అహ్మదాబాద్‌ వేదికగా అప్ఘానిస్థాన్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడిన అనంతరం ఆ జట్టు బ్యాటర్‌ రహ్మనుల్లా గుర్బాజ్‌ చేసిన పనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అహ్మదాబాద్‌ వీధుల్లోకి వెళ్లి..
తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అహ్మదాబాద్‌ వీధుల్లోకి వెళ్లిన గుర్బాజ్‌.. ఫుట్‌పాత్‌ మీద నిద్రపోతున్న వారి దగ్గరకు వెళ్లి.. రూ.500 నోట్ల వారి దగ్గర వదిలి వచ్చాడు. ఉండేందుకు కనీసం ఇళ్లు కూడా లేని ఆ పేద ప్రజలు దీపావళి పండుగను ఆనందం జరుపుకోవడం కోసం గుర్బాజ్‌ వారి దగ్గర కరెన్సీ నోట్లను ఉంచి వచ్చాడు. అతడికి ఓ మహిళ సహకరించింది. అనంతరం గుర్బాజ్‌ కార్లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

నెట్టింట్లో వీడియో..
ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో వైరల్‌ అవుతోంది. అహ్మదాబాద్‌లోని దూరదర్శన్‌ క్రాస్‌ రోడ్‌ సమీపంలో గుర్బాజ్‌ ఇలా చేశాడని వీడియో తీసిన వ్యక్తి తెలిపాడు. గుర్బాజ్‌ చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. నిరాశ్రయలైన పేదలు దీపావళి జరుపుకోవడం కోసం గుర్బాజ్‌ ఇలా చేయడాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. అందుకే అప్ఘానిస్థాన్‌ క్రికెటర్లను భారతీయులు ఇష్టపడతారని పలువురు కామెంట్‌ చేస్తున్నారు.