Transgender Heroine: ఫస్ట్ టైం హీరోయిన్ గా ట్రాన్స్జెండర్… హీరో ఎవరంటే?
తాజాగా ఎవరు ఊహించని విధంగా ఒక సినిమాలో ట్రాన్సజెండర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇది ఎక్కడో కాదు కన్నడ పరిశ్రమలో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది.

Transgender Heroine: ఈ రోజుల్లో సినిమా ను చూసే ప్రేక్షకుల అభిరుచులు, అభిప్రాయాలూ సృష్టంగా మారిపోతున్నాయి. సినిమా లో ఏదైనా కొత్తదనం ఉందనిపిస్తే తప్ప పెద్ద స్టార్ హీరో సినిమా అయినా కానీ దాని వైపు చూడటం లేదు. ఇక సినిమాలో మ్యాటర్ ఉందని తెలిస్తే ముక్కు మొహం తెలియని క్యాస్టింగ్ ఉన్న కానీ సినిమా కు బ్రహ్మరథం పడుతున్నారు. దీనితో మేకర్స్ తమ ఆలోచనలకు పదును పెడుతూ కొత్త కొత్త కాంబినేషన్స్ సెట్ చేస్తున్నారు.
తాజాగా ఎవరు ఊహించని విధంగా ఒక సినిమాలో ట్రాన్సజెండర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇది ఎక్కడో కాదు కన్నడ పరిశ్రమలో జరిగిన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఆ సినిమా పేరు మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ. ఈ సినిమా కోసం ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేశారు. అందులో వైశాలి అనే ట్రాన్సజెండర్ కూడా ఒకరు. దీనితో సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న తొలి ట్రాన్సజెండర్ గా గుర్తింపు తెచ్చుకుంది.
రీసెంట్ గా మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ ట్రైలర్ లాంచ్ కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వైశాలి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ” మాకు ఒక జీవితం అనేది ఉంటుంది.. అసలు మేము ఎందుకు అడుక్కోవాలి. అందరి లాగానే మాకు సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని కలలు ఉన్నాయి. దాని కోసం నేను ప్రయత్నాలు చేశాను. అందుకు తగ్గట్లే మిస్టర్ అండ్ మిసెస్ మన్మధ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చిందని చెప్పింది.
అదే కాకుండా మమ్మల్ని ప్రజలు చూసే తీరు కూడా మారాల్సి ఉంది. బస్సు లో మా పక్కన కూర్చోవడానికి కూడా అనేక మంది ఆలోచిస్తారు. అలాంటి పరిస్థితులు మారాలి. ఇక నా విషయానికి వస్తే నేను గోవా లోని ఓ క్లబ్ లో డాన్సర్ గా పనిచేసే దానిని. అక్కడ చేస్తూ సినిమాల్లో అవకాశాలు కోసం ట్రై చేశాను. మిస్టర్ అండ్ మిసెస్ మన్మధ సినిమాలో అవకాశం రావడంతో ఉద్యోగం వదిలేసి ఇక్కడకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమా అక్టోబర్ 6 న విడుదల కాబోతుంది .
