Transformers Rise Of The Beasts Review: ‘ట్రాన్స్ ఫార్మర్స్ – ది రైజ్ ఆఫ్ బీస్ట్స్’ మూవీ ఫుల్ రివ్యూ
హాలీవుడ్ తెరకెక్కే సూపర్ హీరో సినిమాల స్టోరీస్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. దుష్ట శక్తులు ఈ ప్రపంచాన్ని ఆవహించడం, ఆ శక్తుల నుండి సూపర్ హీరోలు ఈ ప్రపంచాన్ని కాపాడడం, ఇది మన చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాము.

Transformers Rise Of The Beasts Review: మన ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిల్లో ట్రాన్స్ ఫార్మర్స్ సిరీస్ కి యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.ఈ సిరీస్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ థియేటర్స్ కి క్యూలు కట్టేస్తారు.ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన సిరీస్ ఇది. ఈ సిరీస్ నుండి లేటెస్ట్ గా వచ్చిన చిత్రం ‘ట్రాన్స్ ఫార్మర్స్- ది రైజ్ ఆఫ్ బీస్ట్స్’. ట్రైలర్ లో ప్రపంచం లో ఉన్న కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకున్న ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూడబోతున్నాము.
కథ :
యూనికార్న్ అనే డార్క్ డెవిల్ టైం ట్రావెల్ లో ప్రయాణం చేసే ట్రాన్స్ వార్ప్ కీ కావాలని కోరుకుంటాడు. అందుకోసం ఆయన చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇలాంటి దుష్ట శక్తుల చేతికి ఆ కీ దొరకకుండా ఉండేందుకు కోసం కొన్ని రోబోటిక్ బీస్ట్ ట్రాన్స్ ఫార్మర్స్ ఈ కీ ని కొన్ని భాగాలుగా విభజించి ఒక్కో చోట ఒక్కో భాగం దాచి సురక్షితంగా కాపాడుతూ వస్తారు. మరి ఈ కీ విషయం లో యూనికార్న్ ఏమి చేసాడు?,ఆ కీ ని గెలుచుకున్నాడా లేదా ?, అతని చేతికి ఈ కీ దక్కకుండా ఉండేందుకు ట్రాన్స్ ఫార్మర్స్ ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది వెండితెర మీద చూడాల్సిందే .
విశ్లేషణ :
హాలీవుడ్ తెరకెక్కే సూపర్ హీరో సినిమాల స్టోరీస్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. దుష్ట శక్తులు ఈ ప్రపంచాన్ని ఆవహించడం, ఆ శక్తుల నుండి సూపర్ హీరోలు ఈ ప్రపంచాన్ని కాపాడడం, ఇది మన చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాము. ఒకే లైన్ మీద ఇన్ని సినిమాలు వస్తున్నప్పటికీ అవి హిట్ అవుతున్నాయి అంటే దానికి కారణం యాక్షన్ సన్నివేశాలే. ఆడియన్స్ కేవలం వీటిని థియేట్రికల్ అనుభూతిని చెందడం కోసమే వెళ్తుంటారు. ఈ సినిమా స్టోరీ లైన్ కూడా అంతే. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి కానీ, గత చిత్రాలతో పోలిస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. ఈ సిరీస్ మొత్తానికి ‘ఆప్టిమస్ ప్రైమ్’ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ చిత్రం లో కూడా ఆటో బాట్ ‘బంబుల్ బీ’ కి అలాంటి క్రేజ్ ఉంటుంది,అయితే దాని నిడివి చిత్రంలో తక్కువ ఊడడం మైనస్ పాయింట్స్ లో ఒకటిగా చెప్పొచ్చు.
చివరి మాట :
ట్రాన్స్ ఫార్మర్స్ సిరీస్ ని బాగా నచ్చే వాళ్లకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతాది. ఇక యాక్షన్ మూవీ లవర్స్ కి అయితే కనుల పండుగ లాగానే ఉంటుంది.అయితే గత సినిమాలతో పోలిస్తే కాస్త తగ్గింది అనే చెప్పాలి.
రేటింగ్ :3 /5
