Toyota Corolla Cross: మహీంద్రా XUV 700 కి ఎట్టకేలకు గట్టి పోటీ రాబోతుంది… అదీ Toyota నుంచి..
కరోలా క్రాస్ 2023 మిగతా వెహికిల్స్ కంటే విభిన్నంగా ఉంటుంది. గతంలో జపాన్ లో లాంచ్ చేసిన వెర్షన్ ను పోలీ ఉంటుంది. SUV లల్లో మిడ్ ఇంపాక్ట్ ఆకట్టుకుంటుంది. లాంగ్ జర్నీతో పాటు సౌకర్యవంతమైన సీటింగ్ దీని సొంతం.

Toyota Corolla Cross: స్పోర్ట్స్ మోడల్ కార్లలో తిరగాలనుకునేవారికి టయోటా కంపెనీ మంచి ఆప్షన్ గా పేర్కొంటారు. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే వివిధ మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకుంటున్నాయి. ఎక్కువగా SUV టైప్ మాత్రమే ఉత్పత్తి చేసే టయోటా లేటేస్టుగా మరో మోడల్ ‘కరోరా క్రాస్’ ను తీసుకొస్తుంది. పవర్ ఫుల్ ఇంజిన్.. స్టైలిజ్ డిజైన్ తో ఆకట్టుకుంటున్న ఈ మోడల్ డిటేయిల్స్ ఇప్పటికే ఆన్లైన్లో లీక్ చేశారు. దీంతో కారుపై మోజు ఉన్నవారు దీనిని బుక్ చేసుకుందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ‘కరోరా క్రాస్’ కు సంబంధించిన ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
కరోలా క్రాస్ 2023 మిగతా వెహికిల్స్ కంటే విభిన్నంగా ఉంటుంది. గతంలో జపాన్ లో లాంచ్ చేసిన వెర్షన్ ను పోలీ ఉంటుంది. SUV లల్లో మిడ్ ఇంపాక్ట్ ఆకట్టుకుంటుంది. లాంగ్ జర్నీతో పాటు సౌకర్యవంతమైన సీటింగ్ దీని సొంతం. అద్భుతమైన టెక్నాలజీతో పాటు లార్జ్ వెహికిల్స్ మోడల్ లో ఉంటుంది. అత్యుత్తమ ఇంజిన్ ను కలిగి ఉన్న ఇది అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. కరోలా క్రాస్ హైబ్రీడ్ ను చూస్తే SUV మహీంద్రా, హుంద్యాయ్ అల్కాజర్ కు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
కరోలా క్రాస్ SUV 2023 లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 138 బీహెచ్ పీ పవర్, 177 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని సూపర్ సీబీటి-ఐ తో జత చేయవచ్చు. టోటల్ బాడీ హై రేంజ్ లో ఉండి బ్లాక్ మెష్ నమూనాతో ఉంటుంది. పెద్ద గ్రిల్ తో బ్లాక్ సరౌండ్, డీఆర్ ఆర్ ఎల్ స్వెప్ట్ బ్యాక్ ఫుల్ ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్స్ దీని సొంతం. ముందు భాగంలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్, పెద్ద వీల్ ఆర్స్ ఉన్నాయి. 18 ఇంచుల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వెనుక హంచ్ లు కలిగి ఉన్న కరోలా బ్లాక్ బంపర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
నేటి కాలంలో చాలా మంది SUVలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే మహీంద్రా, హ్యుందాయ్ లు SUVల మోడళ్లను ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చి ఆకట్టుకుంటున్నారు. వాటికి పోటీనిచ్చేలా కరోలా క్రాస్ హైబ్రిడ్ ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. మొత్తంగా కరోలా క్రాస్ బలమైన ఇంజన్ వ్యవస్థ కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఇది మార్కెట్లో ఏ విధంగా ఆకర్షిస్తుందో చూడాలి.
