NTR -Dhanush : రేపే ఎన్టీఆర్ – ధనుష్ మూవీ ప్రారంభం.. ఫ్యాన్స్ కి ఇది నిజంగా ఊహించని ట్విస్ట్
Tomorrow NTR-Dhanush movie starts : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడు క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమాల హవా ఊపందుకుంది.ఒకప్పుడు సీనియర్ హీరోలు మరియు నేటి తరం హీరోలు కలిసి ఒక సినిమాలో నటించేవారు.కానీ ఇప్పుడు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసేస్తున్నారు.ఒకప్పుడు స్టార్ హీరోలతో మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యాలంటే దర్శకనిర్మాతలు భయపడేవారు.కానీ #RRR మూవీ సక్సెస్ తర్వాత ప్రతీ మేకర్ లోను మల్టీస్టార్ర్ర్ చేసే ధైర్యం వచ్చింది.సరికొత్త కాంబినేషన్ కోసం మన దర్శక […]

Tomorrow NTR-Dhanush movie starts : సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడు క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమాల హవా ఊపందుకుంది.ఒకప్పుడు సీనియర్ హీరోలు మరియు నేటి తరం హీరోలు కలిసి ఒక సినిమాలో నటించేవారు.కానీ ఇప్పుడు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టార్ర్ర్ సినిమాలు చేసేస్తున్నారు.ఒకప్పుడు స్టార్ హీరోలతో మల్టీస్టార్ర్ర్ సినిమాలు చెయ్యాలంటే దర్శకనిర్మాతలు భయపడేవారు.కానీ #RRR మూవీ సక్సెస్ తర్వాత ప్రతీ మేకర్ లోను మల్టీస్టార్ర్ర్ చేసే ధైర్యం వచ్చింది.సరికొత్త కాంబినేషన్ కోసం మన దర్శక నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు.
అలా రీసెంట్ గా ఎన్టీఆర్ – ధనుష్ కాంబినేషన్ లో ఒక సినిమా సెట్ అయ్యిందని, ప్రముఖ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని.రేపే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన చెయ్యబోతున్నారు అంటూ తమిళ మీడియా నుండి ఒక వార్త సెన్సేషన్ సృష్టించింది.దీనితో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయ్యారు, తమిళ టాప్ మీడియా చానెల్స్ కూడా ఈ విషయం పై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది.
గ్రౌండ్ లెవెల్ లో న్యూస్ బాగా వ్యాప్తి చెందడం తో అప్రమత్తమైన ఎన్టీఆర్ టీం వెంటనే స్పందించింది.సోషల్ మీడియా లో గత కొద్దీ సేపటి నుండి ప్రచారం అవుతున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు.ఏదైనా న్యూస్ ఉంటె స్వయంగా మేమే తెలియజేస్తామని, దయచేసి వేరేవాళ్లు చెప్పే మాటలను నమ్మొద్దు అంటూ ఈ సందర్భంగా తెలిపారు.
దీనితో క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది అనే వార్త తెలిసి, అది నిజం కాదని వెంటనే తెలియడం తో అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.ఫేక్ వార్తలను ప్రచారం చేసిన వారిపై మండిపడ్డారు.యాక్టింగ్ కి పవర్ హౌస్ లాంటి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి ఒకే సినిమాలో చేస్తే చూడాలని ఉందని, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని అటు ధనుష్ అభిమానులు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు.
