Suryakumar Yadav- Tom Moody: ఏం కొట్టుడు అది.. 10 మిలియన్ల బాల్స్ కు సూర్యకుమార్ వద్ద సమాధానం
సూర్య బాదుడు మొదలెట్టిన తరువాత బౌలర్లు షాక్ అయ్యారు. ఎలాంటి బంతి విసిరినా బౌండరీలు వెళ్లడంతో ఆయన ఎలా కొడుతున్నాడో అర్థం కాలేదు. అయితే మహ్మద్ షమీ వేసిన 19వ ఓబర్ లో సూర్య కొట్టిన సిక్స్ ఈ సీజన్ కే హైలెట్ గా నిలిచింది.

Suryakumar Yadav- Tom Moody: సిక్స్ లు.. ఫోర్లు.. వీటికి తోడు ఒకే సారి రెండు రన్లు.. సింగిల్స్.. బాదుడే.. బాదుడు.. ఐపీఎల్ లో సూర్యకుమార్ యాదవ్ ప్రతాపం ఇది. చివరి 15 బంతుల్లో ఈ క్రీడాకారుడి విధ్వంసానికి స్పోర్ట్స్ వరల్డ్ షాక్ అవుతోంది. బాల్ పడితే చాలు.. అది ఫోర్ లేదా సిక్స్ అని ఫిక్సయ్యే విధంగా సూర్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. విరాట్, బట్లర్ లాంటి స్టార్ క్రికెటర్లు సైతం సూర్య ఫర్ఫామెన్స్ కు ఫిదా అయ్యారు. ఇలాంటి బ్యాటింగ్ సూర్యకుమార్ తప్ప ఇంకెవ్వరు చేయలేరని కొనియాడుతున్నారు. శుక్రవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో సూర్య చేసి అద్భుతంపై క్రీడా లోకం తీవ్రంగా చర్చించుకుంటోంది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ఓ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కు బౌలింగ్ వేయడం కష్టం అని కొనియాడారు.
2023 ఐపీఎల్ ఆరంభంలో సూర్య ఆటతీరు సాధారణంగానే సాగింది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మొదటి 50 పరుగులకు 32 బంతులు తీసుకున్నారు. ఆ తరువాత చివరి 17 బంతుల్లో చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్స్ లు కలిపి పరుగుల వరద పారించాడు. 17వ ఓవర్ లో ఏకంగా 53 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ మొత్తంగా 49 బంతుల్లో 11 పోర్లు, 6 సిక్స్ లతో 103 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తన ఐపీఎల్ కెరీర్ లోనే తొలి శతకాన్ని నమోదు చేసిన సూర్య ఆటతీరుపై తీవ్రంగా చర్చ సాగుతోంది.
సూర్య బాదుడు మొదలెట్టిన తరువాత బౌలర్లు షాక్ అయ్యారు. ఎలాంటి బంతి విసిరినా బౌండరీలు వెళ్లడంతో ఆయన ఎలా కొడుతున్నాడో అర్థం కాలేదు. అయితే మహ్మద్ షమీ వేసిన 19వ ఓబర్ లో సూర్య కొట్టిన సిక్స్ ఈ సీజన్ కే హైలెట్ గా నిలిచింది. మునుపెన్నడూ ఏ బ్యాటర్ ఆడని రీతిలో ఈ షాట్ రికార్డుల్లో నమోదైంది. సూర్య ఆట ప్రదర్శనపై స్టేడియంలో ఉనన అభిమానులంతా ఫిదా అయ్యారు. ముంబై ఇండియన్ మెంటర్ సచిన్ టెండూల్కర్ సైతం ఆశ్చర్యపోవడం విశేషం. తన రిస్ట్ ను ఎలా తిప్పతున్నాడో తెలియక తికమక పడ్డారు.
ఇదిలా ఉండగా మాజీ ఆస్ట్రేలిలియా స్టార్ ప్లేయర్ టామ్ మూడీ తన జీవితంలో ఇలాంటి బ్యాట్స్ మెన్ నుచూడలేదని అన్నారు. అమోల్ మజుందాన్ అనే ప్లేయర్ సూర్యకుమార్ కు బౌలింగ్ వేయడం కష్టం అని కొనియాడారు. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. సూర్యతో పాటు రోహిత్ శర్మ 29, ఇషాన్ కిషన్ 31 పరుగులతో నిలిచారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4 వికెట్లు, మోహిత్ శర్మ ఓ వికెట్ తీసుకున్నారు.
