Tollywood Actor Srihari: రియల్ స్టార్ శ్రీహరి కి రెండు సార్లు పెళ్లి అయ్యింది అనే విషయం ఎవరికైనా తెలుసా..? మనసుల్ని కదిలిస్తున్న సంచలన నిజం!
అలాంటి సమయం లో వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకొని విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. అలా వచ్చిన ఫేమ్ తో హీరో గా మారి ఎన్నో సక్సెస్ లు అందుకున్నాడు. ఒక వయస్సుకి వచ్చిన తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాడు. ఇప్పుడు ఆయన బ్రతికి ఉండుంటే ఇంకా ఎన్ని అద్భుతమైన పాత్రలు చేసేవాడో. తెలుగు సినిమా చేసుకున్న దురదృష్టం వల్ల ఆయన నేడు బౌతికంగా మన మధ్య లేరు.

Tollywood Actor Srihari: కొంతమంది నటీనటులు మన మధ్య ఉన్నా లేకపోయినా మన మనస్సులో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తారు. అలాంటి గొప్ప ఆర్టిస్ట్స్ నుండి ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే అవుతుంది. అలాంటి నటులలో ఒకడు రియల్ స్టార్ శ్రీహరి. సినిమాల్లోకి అవకాశాలు సంపాదించడం కోసం ఆయన కెరీర్ ప్రారంభం లో ఎన్నో కష్టాలను ఎదురుకున్నాడు.
అలాంటి సమయం లో వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకొని విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. అలా వచ్చిన ఫేమ్ తో హీరో గా మారి ఎన్నో సక్సెస్ లు అందుకున్నాడు. ఒక వయస్సుకి వచ్చిన తర్వాత క్యారక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించాడు. ఇప్పుడు ఆయన బ్రతికి ఉండుంటే ఇంకా ఎన్ని అద్భుతమైన పాత్రలు చేసేవాడో. తెలుగు సినిమా చేసుకున్న దురదృష్టం వల్ల ఆయన నేడు బౌతికంగా మన మధ్య లేరు.
ఇకపోతే శ్రీహరి వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆయన డిస్కో శాంతి ని పెళ్లి చేసుకున్నాడు, వీళ్లిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇది ఎవరిని అడిగినా చెప్తారు, కానీ వీళ్ళ పెళ్లి గురించి మనకెవ్వరికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటో ఒకసారి చూద్దాము. శ్రీహరి హీరో గా మారకముందే డిస్కో శాంతిని ప్రేమించాడు. సినిమాల్లోకి హీరోయిన్ అవ్వాలనే కలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆమె తొలి రెండు సినిమాల్లో హీరోయిన్ గానే నటించింది. కానీ ఆ రెండు సినిమాలు ఆర్ధిక సమస్యల వల్ల విడుదల అవ్వలేదు.
అప్పటికే తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఎదురుకుంటున్న తన కుటుంబం ని పోషించడం కోసం ఐటమ్ సాంగ్స్ చేస్తూ వచ్చింది. అలా వచ్చిన డబ్బులతోనే తన తోబుట్టువుల పెళ్లిళ్లను కూడా చేసింది. అయితే శ్రీహరి పెళ్లి చేసుకుందాం అని అడిగినప్పుడు నాకు ఇంట్లో చాలా బాధ్యతలు ఉన్నాయి, పెళ్లి చేసుకోలేను అని అనింది అట. పెళ్లి అయ్యాక మొత్తం నేను చూసుకుంటాను, నువ్వు సినిమాలు చేసినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి గుడికి తీసుకెళ్లి తాళి కట్టాడట. అయితే తాళి కట్టిన వెంటనే ఆ తాళి ని తీసి దేవుడి హుండీ లో వేసిందట. అది ఆమె మొక్కు అని శ్రీహరి అడిగినప్పుడు చెప్పిందట. ఆ తర్వాత వీళ్లిద్దరు మళ్ళీ 1996 వ సంవత్సరం లో పెద్దల సమక్ష్యం లో పెళ్లి చేసుకున్నారు. అలా శ్రీహరి రెండు సార్లు డిస్కో శాంతిని పెళ్లి చేసుకున్నాడు.