Vasant Panchami 2023: సరస్వతి దేవి పుట్టిన రోజున వసంత పంచమిగా పిలుస్తారు. ఇది మాఘ మాసంలో వస్తుంది. మన క్యాలెండర్ ప్రకారం ఈ మాసంలో శుద్ధ పంచమిని ఆమె పుట్టిన రోజుగా శాస్త్రాలలో పేర్కొనబడింది. తూర్పు ప్రాంతాల్లో దీన్ని సరస్వతి పూజగా పిలుచుకుంటారు. ఆలయాలు అలంకరిస్తారు. ఆమెకు ప్రత్యేక పూజలు చేసి ప్రార్థిస్తుంటారు. సరస్వతిని కొలవడం వల్ల జ్ణానం పెరుగుతుందని భావిస్తారు. అందుకే అందరు కూడా ఆమెను కొలిచి తమ కోరికలు నెరవేర్చుకోవాలని బాసర సందర్శిస్తుంటారు.

Vasant Panchami 2023
నేడు వసంత పంచమిని ఘనంగా జరుపుకుంటున్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారిని కొలుస్తున్నారు.సరస్వతి అంటే ప్రవాహం. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. చైతన్యానికి ఉత్పాదకత వసంత రుతువు నుంచి మొదలవుతుంది. బ్రహ్మకు భార్యగా సరస్వతి ఉంటుంది. శక్తిప్రదాయిని మోక్షదాయిని అయిన శారద అమ్మవారిని పూజిస్తే విశేష ఫలాలు దొరుకుతాయని ఈ రోజు ఆమెను ప్రత్యేకంగా పూజించేందుకు అందరు ఉత్సాహం చూపిస్తారు. బాసర ఆలయం భక్తులతో కిక్కిరిసి పోతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అక్కడకు చేరుకుని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఉత్సాహం చూపిస్తారు.
దీంతో ఆలయం సందడిగా మారుతుంది. ఆలయాలే కాకుండా పాఠశాలల్లో కూడా వసంత పంచమి వేడుకలు జరుపుకుంటారు. విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు బాగా రావాలని ప్రార్థిస్తుంటారు. వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా పిలుస్తుంటారు. శ్రీ అంటే సంపద. జ్ణాన సంవత్ర్పద అయిన సరస్వతి దేవిని ఈ రోజు పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సరస్వతి కటాక్షం కలగాలని, సత్ప్రవర్తనతో మెరుగైన సమాజం ఏర్పడాలని కోరుకుంటారు.

Vasant Panchami 2023
ఇందులో భాగంగానే ఆమెను ఆరాధిస్తుంటారు. భక్తితో కొలుస్తారు.వసంత పంచమి రోజు ఆమెను స్మరిస్తూ మంత్రాలు జపిస్తారు. ఈ రోజు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే పిల్లలు బాగా చదువుతారని నమ్ముతుంటారు. దీంతో పిల్లలు జ్ణానవంతులుగా మారతారని విశ్వసిస్తారు. అమ్మ కరుణతో వారు ఎంతో ఎత్తుకు ఎదుగుతారని చెబుతారు. సరస్వతి కటాక్షం భక్తులందరిపై కలగాలని ఆమెను కొలుస్తూ వేడుకుంటారు. తమకు మోక్షం కలిగించాలని ప్రార్థిస్తారు. అమ్మవార్లలో సరస్వతికి ప్రత్యేక ఆలయాలు తక్కువే ఉన్నాయి. వేళ్ల మీద లెక్కించే విధంగానే ఉన్నాయి. దీంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఆమె సన్నిదానంలో మొక్కులు తీర్చుకోవడం సహజమే.