Pawan Kalyan-Sai Dharam Tej Movie Title: పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ మూవీకి టైటిల్ ఖరారు..ఇదేమి టైటిల్ అండీ బాబోయ్!
Pawan Kalyan-Sai Dharam Tej Movie Title: పవన్ కళ్యాణ్ సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కి ఎప్పుడు లేనంత ఊపు ని రప్పిస్తున్నాడు.కానీ అభిమానులు మొదటి నుండి వేడుకునేది ఒక్కటే.ప్రతీ హీరో పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటున్న ఈరోజుల్లో, కనీసం ఆ రేంజ్ సినిమాలు చెయ్యకపోయినా రీమేక్ సినిమాలు మాత్రం వద్దు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా సాక్షిగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కి […]


Pawan Kalyan-Sai Dharam Tej Movie Title
Pawan Kalyan-Sai Dharam Tej Movie Title: పవన్ కళ్యాణ్ సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కి ఎప్పుడు లేనంత ఊపు ని రప్పిస్తున్నాడు.కానీ అభిమానులు మొదటి నుండి వేడుకునేది ఒక్కటే.ప్రతీ హీరో పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటున్న ఈరోజుల్లో, కనీసం ఆ రేంజ్ సినిమాలు చెయ్యకపోయినా రీమేక్ సినిమాలు మాత్రం వద్దు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా సాక్షిగా ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న ప్రస్తుత పరిస్థితులలో తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా సీతం’ ని రీమేక్ చెయ్యాల్సి వస్తుంది.ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేడే ప్రారంభం అయ్యింది.ఈ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ మీద మాత్రమే కాకుండా కేతిక శర్మ మరియు ప్రియాంక వారియర్ వంటి హీరోయిన్స్ పై కూడా పలు షాట్స్ ని తెరకెక్కించారు.
ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా కొనసాగి, ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో రాణిస్తున్న సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు ఏవైతే కోరుకుంటున్నారో, అవన్నీ పుష్కలంగా ఉండేలాగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో శ్రద్ద తీసుకున్నాడట.అంతే కాకుండా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ కూడా ఖరారు అయ్యిపోయినట్టు తెలుస్తుంది.’దేవుడే దిగి వచ్చిన’ అనే టైటిల్ ని పెట్టేందుకు పరిశీలిస్తున్నారట.

Pawan Kalyan-Sai Dharam Tej Movie Title
ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రని పోషిస్తున్నాడు అనే విషయం ఈ చిత్రం మాతృక చూసిన ప్రతీ ఒక్కరికీ అర్థం అవుతాది.ఇదివరకే ఆయన ‘గోపాల గోపాల’ అనే సినిమాలో దేవుడిగా కనిపించాడు, రెస్పాన్స్ అదిరిపోయింది.ఇప్పుడు మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడు.జనాలు ఆయనని అదే రేంజ్ లో రిసీవ్ చేసుకుంటారో లేదో చూడాలి.
