Tipu Sultan Sword Auction: లండన్‌లో టిప్పు సుల్తాన్‌ ఖడ్గం వేలం.. ఎన్ని కోట్ల ధర పలికిందో తెలుసా..!?

టిప్పు సుల్తాన్‌ 1175 నుంచి 1779 వరకూ మరాఠాలపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధాల్లో ఈ ఖడ్గాన్ని వాడినట్టు బాన్‌హమ్స్‌ చెప్తోంది. ఈ ఖడ్గాన్ని సుల్తాన్‌ మరణానంతరం అతని బెడ్‌ ఛాంబర్‌లో కనుగొన్నారు.

  • Written By: DRS
  • Published On:
Tipu Sultan Sword Auction: లండన్‌లో టిప్పు సుల్తాన్‌ ఖడ్గం వేలం.. ఎన్ని కోట్ల ధర పలికిందో తెలుసా..!?

Tipu Sultan Sword Auction: 18వ శాతాబ్దపు మైసూర్‌ చక్రవర్తి టిప్పు సుల్తాన్‌ ఉపయోగించిన ఖడ్గాన్ని లండన్‌లో వేలం వేశారు. దీనికి భారీ ధర పలికింది. సుమారు రూ.140 కోట్లకు ఆ ఖడ్గం అమ్ముడు పోయినట్లు వేలం నిర్వహించిన బాన్‌హమ్స్‌ హౌస్‌ వెల్లడించింది. అంచనా వేసిన దాని కన్నా ఏడు రెట్లు ఎక్కువ ధరకు ఖడ్గం అమ్ముడుపోయినట్లు తెలిపింది. 18వ శతాబ్దంలో ఎన్నో యుద్ధాలను గెలిచిన టిప్పు సుల్తాన్‌ ఈ ఖడ్గాన్ని వాడినట్లు ఆధారాలు ఉన్నాయని బాన్‌హమ్స్‌ పేర్కొంది.

అనేక యుద్ధాలుచేసిన సుల్తాన్‌..
టిప్పు సుల్తాన్‌ 1175 నుంచి 1779 వరకూ మరాఠాలపై యుద్ధం చేశాడు. ఆ యుద్ధాల్లో ఈ ఖడ్గాన్ని వాడినట్టు బాన్‌హమ్స్‌ చెప్తోంది. ఈ ఖడ్గాన్ని సుల్తాన్‌ మరణానంతరం అతని బెడ్‌ ఛాంబర్‌లో కనుగొన్నారు. టిప్పు సుల్తాన్‌ హత్యకు గురైన తరవాత ఖడ్గాన్ని బ్రిటీష్‌ మేజర్‌ జనరల్‌ డేవిడ్‌ బెయిర్డ్‌గి అప్పగించినట్లు ఆక్షన్‌ హౌస్‌ ధ్రువీకరించింది.

వేలంలో పోటాపోటీ..
ఈనెల 23న టిప్పు సుల్తాన్‌ ఖడ్గాన్ని వేలం వేశారు. ఖడ్గం దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున బిడ్డర్లు పోటీ పడ్డారు. ధర భారీగా పెరుగుతూ పోతుండడంతో మధ్యలోనే చాలా మంది డ్రాప్‌ అయ్యారు. ముగ్గురు మాత్రం చివరి వరకు తీవ్రంగా పోటీ పడ్డారు. చివరికి ఓ వ్యక్తి ఆ ఖడ్గాన్ని 1,40,80,900 పౌండ్లకు దక్కించుకున్నాడు. అంటే భారత కరెన్సీలో రూ.144 కోట్లు అన్నమాట. అంత పెద్ద మొత్తానికి ఖడ్గం అమ్ముడుపోతుందని ఊహించలేదని ఆంక్షన్‌ నిర్వాహకులు తెలిపారు. తాము అనుకున్న దానికంటే 7 రెట్లు ఎక్కవ ధరకు అమ్ముడుపోయిందని వెల్లడించారు.

అద్భుతమైన ఖడ్గాల్లో ఒకటి..
చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకూ అత్యంత అద్భుతంగా తయారైన ఖడ్గాల్లో టిప్పు సుల్తాన్‌ ఖడ్గం ఒకటి. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతేకాదు.. టిప్పు సుల్తాన్‌ వాడిన ఆయుధాల్లో ఇది చాలా కీలకమైంది. ఈ కత్తిపై భగవంతుని ఐదు గుణాలు, ప్రత్యేకంగా రెండు ప్రార్థనలు హిల్ట్‌ మీద బంగారు అక్షరాలతో చెక్కబడి ఉన్నాయి. కత్తిపై ‘పాలకుడి కత్తి’ అని రాసి ఉంటుంది. కత్తిపై రత్నాలు పొదిగి ఉన్నాయి. పిడి వద్ద పులితల బొమ్మ ఉంటుంది. ఈ కత్తి తయారీ వెనుక ఆశ్చర్యపోయే ఆధారాలు, కత్తి నైపుణ్యం గురించి చరిత్ర దాగి ఉన్నాయి.

టైగర్‌ ఆఫ్‌ మైసూర్‌గా గుర్తింపు..
టిప్పు సుల్తాన్‌కు ‘టైగర్‌ ఆఫ్‌ మైసూర్‌’ అని పిలుస్తుంటారు. అతడు అత్యంత ధైర్యసాహసాలు కలవాడని, తన సామ్రాజ్యాన్ని రక్షించుకోవడంలో ఎన్నో యుద్ధాలు చేసినట్లు చరిత్ర చెప్తోంది. అయితే సైనికులు మోసం చేయడంతో టిప్పు సుల్తాన్‌ మరణించాడని చరిత్ర పుటల్లో ఉంది. టిప్పు సుల్తాన్‌ మేని ఛాయతో నల్లగా, తక్కువ ఎత్తు, కళ్లు పెద్దవిగా ఉండేవని.. ప్రసిద్ధ చరిత్రకారుడు కల్నల్‌ మార్క్‌ విల్క్‌ ఓ పుస్తకంలో వివరించారు.

సంబంధిత వార్తలు