Telangana BJP: టీ బీజేపీకి టైమ్స్ నౌ షాక్.. గెలిచేది 2 లేదా 3..!
తాజాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టౌమ్స్ నౌ ఫలితాలు టీబీజేపీకి షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం తెలంగాణలో నాలుగు ఎంపీస్థానాలు బీజేపీకి ఉండగా, 2024 ఎన్నికల్లో అవి తగ్గుతాయని టౌమ్స్‌నౌ సర్వే తేల్చింది.

Telangana BJP: తెలంగాణ బీజేపీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. ఒకానొక దశలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించిన బీజేపీని ప్రజలు కూడా ఓన్ చేసుకునే ప్రయత్నాలు చేశారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. బండి సంజయ్‌ను తప్పించడం పార్టీకి పెద్ద మైనస్ పాయింట్‌గా చెప్పవచ్చు. బండిని తప్పించడానికి ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానం వద్ద చేసిన లాబీయింగ్ ఫలించింది. కానీ, పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. తెలంగాణ బీజేపీ బండి సంజయ్‌కి ముందు.. బండి సంజయ్‌కి తర్వాత అన్నట్లుగా ఉంది.
అన్నీ ఈటలే..
ఇక ప్రస్తుతం బీజేపీ సారథిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. ఎన్నిలక కమిటీ చైర్మన్‌గా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించింది. కానీ, ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి అన్నీ ఈటలే అయి వ్యవహరిస్తున్నారు. కిషన్‌రెడ్డి పేరుకే అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు బీజేపీలో చేరికలు పూర్తిగా ఆగిపోయాయి. వలసలు పెరుగుతున్నాయి. ఈటల బుజ్జగించినా నేతలు పార్టీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. దీంతో పార్టీ ప్రయాణం ఎటువెళ్తుందో అర్థం కాని పరిస్థితి.
టౌమ్స్‌నౌ సర్వే ఫలితాలు షాక్..
తాజాగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టౌమ్స్ నౌ ఫలితాలు టీబీజేపీకి షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం తెలంగాణలో నాలుగు ఎంపీస్థానాలు బీజేపీకి ఉండగా, 2024 ఎన్నికల్లో అవి తగ్గుతాయని టౌమ్స్‌నౌ సర్వే తేల్చింది. ఈ సర్వే బీజేపీకి షాక్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు బీజేపీ నాయకులు 8 నుంచి 10 లోక్‌సభ స్థానాలు గెలుస్తామని చెబుతూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
చేరికలపైనే ఆశలు..
ఇదిలా ఉంటే పార్టీలో చేరికలపైనే నేతలు ఆశలు పెట్టుకున్నారు. త్వరలో 22 మంది బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర తెలిపారు. ఖమ్మం సభలో కొతమంది చేరతరాని, తర్వాత క్రమంగా మిగతావారు చేరతారని అంటున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.
సీనియర్లంతా మౌనం..
ప్రస్తుతం బీజేపీలో సీనియర్లంతా మౌనంగా ఉన్నారు. డీకే అరుణ, ఎంపీ అర్వింద్, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు చాలా మంది సీనియర్లు యాక్టివ్‌గా లేదు. ఇది కూడా అనుమానాలకు తావిస్తోంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వీరంతా కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు.
