Tech Layoffs: ఆర్థిక మాంద్యం బూచి చూపి అమెరికాలో కొలువులను తొలగిస్తున్న కంపెనీల్లో 40% భారతీయులే ఉన్నారు.. వాస్తవానికి ఏ ఐటి కంపెనీలో అయినా మెజారిటీ పక్షం భారతీయులే ఉంటారు.. పైగా కష్టపడి పని చేయడం భారతీయుల నైజం.. మార్కెట్ బాగున్నప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు భారతీయుల వెంట పడ్డ ఐటీ కంపెనీలు… ఇప్పుడు ఆర్థిక మాంద్యం తలెత్తగానే నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.. రేపటి నాడు కోలువు ఉంటుందో ఉండదో అనే భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల కొన్ని నెలలుగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్ సహా పలు సంస్థలు వరుస పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక అనిశ్చితి వేళ వ్యయభారాన్ని తగ్గించుకునేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని పేర్కొంటున్నాయి.. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న వారిలో భారతీయులు అధికంగా ఉన్నారు.. దీంతో ఉద్యోగాల కోతల ప్రభావం భారతీయులపై అధికంగా ఉంది.

Tech Layoffs
వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం
అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థ అయిన వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం అమెరికాలో గత నవంబర్ నుంచి సుమారు రెండు లక్షల మంది ఐటీ ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి.. వీరిలో 40 శాతం మంది భారతీయులేనని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.. వారిలో అత్యధికులు హెచ్ 1 బి, ఎల్ 1 వీసాలపై వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారే. ఈ వీసా నిబంధనల ప్రకారం 60 రోజులకు కొత్త ఉద్యోగం లో చేరితే సరి.. లేకపోతే గడువు ముగిసిన పది రోజుల లోపు దేశాన్ని వీడాలి. దీంతో కొలువు కోల్పోయిన వారంతా ఎలాగైనా అగ్రరాజ్యంలో ఉండేందుకు మరో ఉద్యోగం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు.. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్స్అప్ గ్రూప్ లు ఏర్పాటు చేసుకొని ఉద్యోగ అవకాశాల గురించి ఆరా తీస్తున్నారు. వీరికి ప్రవాస భారతీయ సంఘాలు సహకారం అందిస్తున్నాయి.. ప్రస్తుతం దాదాపు అన్ని ఐటి సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఎంత తక్కువ వ్యవధిలో మరో ఉద్యోగం సాధించడం చాలా కష్టంగా ఉందని నిరుద్యోగులు చెబుతున్నారు.
మినహాయింపు ఇవ్వాలి
అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులను కాపాడుకోవడానికి అమెరికా వీసా విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని ఐటీ నిపుణులు చెబుతున్నారు.. ఉద్యోగ అవకాశాల విషయంలో ఉన్న క్లిష్ట పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఐటీ కంపెనీలు హెచ్ 1 బి ఉద్యోగుల తొలగింపు తేదీని మరికొన్ని నెలలు పొడగించాలని సూచిస్తున్నారు.. వేలాదిమంది ఐటీ ఉద్యోగులు లే ఆఫ్ లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా హెచ్ 1 బి వీసా దారులకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. వీరు ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల్లో కొత్త ఉద్యోగం సంపాదించాలి.

Tech Layoffs
లేదంటే స్వదేశాన్ని వీడి వెళ్లిపోవాలి. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. వారి కుటుంబాలపై ఇది పెను ప్రభావం చూపిస్తోంది. ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది.. భారీ స్థాయిలో పన్నులు చెల్లిస్తూ అమెరికా అభివృద్ధికి కీలకంగా మారిన హెచ్1 బీ వీసాదారులకు టెక్ కంపెనీలు కొన్ని మినహాయింపులు ఇస్తే బాగుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి..