7G Brindavan Colony: 7/జి బృందావన కాలని చిత్రాన్ని వదులుకున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు… వాళ్ళు చేసి ఉంటే?

సోనీ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. రవి కృష్ణ హీరో. ఆయనకు ఇది డెబ్యూ చిత్రం. రవికృష్ణ నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు. నిజానికి ఈ చిత్రాన్ని మొదట సూర్య లేదా మాధవన్ లతో చేయాలని అనుకున్నారట.

  • Written By: Shiva
  • Published On:
7G Brindavan Colony: 7/జి బృందావన కాలని చిత్రాన్ని వదులుకున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు… వాళ్ళు చేసి ఉంటే?

7G Brindavan Colony: 2004లో విడుదలైన 7/జి రైన్ బో కాలని కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. తెలుగులో 7/జి బృందావన కాలని గా విడుదల చేశారు. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం విపరీతంగా యూత్ కి నచ్చేసింది. చాలా సహజంగా సన్నివేశాలు ఉంటాయి. అద్భుతమైన పాటలు. లవ్, కామెడీ, ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా మిక్స్ చేసి దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించారు. తమిళంతో సమానంగా తెలుగులో కూడా ఆడింది. సాధారణంగా ట్రాజిక్ లవ్ స్టోరీస్ ని తెలుగు ప్రేక్షకులు ఆదరించరు. 7/జి బృందావన కాలని చిత్రాన్ని మాత్రం ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు.

సోనీ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. రవి కృష్ణ హీరో. ఆయనకు ఇది డెబ్యూ చిత్రం. రవికృష్ణ నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు. నిజానికి ఈ చిత్రాన్ని మొదట సూర్య లేదా మాధవన్ లతో చేయాలని అనుకున్నారట. వారి డేట్స్ అడ్జస్ట్ కాలేదట. దాంతో సిద్ధార్థతో చేయాలని రవికృష్ణ స్వయంగా సూచించాడట. అప్పుడు సిద్ధార్థ శంకర్ దర్శకత్వంలో బాయ్స్ చేస్తున్నాడు. అప్పుడు రవికృష్ణ తో చేద్దాం అని సెల్వరాఘవన్ అన్నారట.

రత్నం… వీడు చేయగలడగా, సరిపోతాడా అనే సందేహాలు వ్యక్తం చేశాడట. లేదు రవికృష్ణలో ఒక స్పార్క్ ఉంది. ఫ్రెష్ ఫేస్, సెట్ అవుతాడని అని సెల్వరాఘవన్ అన్నారట. ఇక రెండు రోజులు లుక్ టెస్ట్ చేశారట. ఫోటో షూట్ బాగా రావడంతో ప్రొసీడ్ అయ్యాడట. లండన్ లో యాక్షన్ కోర్స్ చేసినప్పటికీ కొన్ని సీన్స్ కి చాలా టేక్స్ తీసుకున్నానని రవికృష్ణ స్వయంగా వెల్లడించాడు. 7/జి బృందావన కాలని రీ రిలీజ్ సందర్భంగా రవికృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతులు పంచుకున్నారు.

మరికొన్ని విశేషాలు కూడా ఈ చిత్రానికి సంబంధించి ఉన్నాయి. సోనీ అగర్వాల్ కంటే ముందు కలర్స్ స్వాతిని తీసుకున్నారట. కొంత షూటింగ్ కూడా అయ్యాక ఆమెను ఎందుకో తప్పించారట. మరొక ఆసక్తికర అంశం ఏంటంటే… ఇది దర్శకుడు సెల్వరాఘవన్ నిజ జీవిత కథ. ఓ నార్త్ అమ్మాయిని సెల్వ రాఘవన్ ప్రేమించాడట. 7/జి బృందావన కాలని రీ రిలీజ్ కి మంచి స్పందన దక్కింది.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు