Mumbai Indians: ముంబై ఇండియన్స్ టీమ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ భారీ హిట్టర్స్…

అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే ఒకప్పుడు ఈ టీం లో హార్దిక్ పాండ్య,కైరాన్ పోలార్డ్ ఇద్దరు కూడా మంచి పెట్ఫామెన్స్ ఇస్తు టీమ్ ని గెలిపించే వారు…ప్రస్తుతం ఈ టీం లో వాళ్లు ఇద్దరు లేకపోవడం వల్ల ఈ టీం కి అది చాలా మైనస్ అయింది.

  • Written By: V Krishna
  • Published On:
Mumbai Indians: ముంబై ఇండియన్స్ టీమ్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ భారీ హిట్టర్స్…

Mumbai Indians: ఇండియా లో ఐపీల్ అంటే చాలు చిన్న పిల్లల దగ్గర నుంచి, పెద్దవాళ్ళ దాక అందరు కూడా టివి లకి అతుక్కు పోయి మరి మ్యాచ్ లని చూస్తారు…వాళ్ళకి ఇష్టమైన ప్లేయర్ ఏ టీం లో ఉంటె ఆ టీమ్ గెలవాలని అందరు కోరుకుంటారు. ఆ టీం లో తాను అభిమానించే ప్లేయర్ మాత్రమే టాప్ స్కోర్ చేయాలనీ, ఆయన మాత్రమే టాప్ లో నిలవాలని అనుకుంటున్నారు.ఇక అసలు విషయం లోకి వెళ్తే ఐపీల్ 2023 లో ముంబై ఇండియన్స్ ప్లే అఫ్ కి వచ్చి వెనుతిరిగిన విషయం మనకు తెలిసిందే…అయితే ఈ టీం ఎదురుకుంటున్న అసలు సమస్య ఏంటంటే ముఖ్యం గా నెంబర్ ఫైవ్, నెంబర్ సిక్స్ లో వీళ్ళకి సరైన ప్లేయర్ లేకపోవడం వల్లే ఈ టీం 2023 ఐపీల్ లో మంచి పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది…

అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే ఒకప్పుడు ఈ టీం లో హార్దిక్ పాండ్య,కైరాన్ పోలార్డ్ ఇద్దరు కూడా మంచి పెట్ఫామెన్స్ ఇస్తు టీమ్ ని గెలిపించే వారు…ప్రస్తుతం ఈ టీం లో వాళ్లు ఇద్దరు లేకపోవడం వల్ల ఈ టీం కి అది చాలా మైనస్ అయింది. నిజానికి వీళ్లు టీం లో ఉన్నప్పుడు చివర్లో చాలా మ్యాచులని వీళ్లిద్దరు వాళ్ళ బ్యాటింగ్ సత్తా తో గెలిపించి చూపించారు…అయితే వీళ్లిద్దరు ప్రస్తుతం అందుబాటు లో లేకపోవడం తో వీళ్ళకి చాలా మ్యాచుల్లో దెబ్బ పడింది అనే చెప్పాలి…అయితే ఈసారి మాత్రం ఒక భారీ హిట్టర్ కోసం ముంబై ఇండియన్స్ టీం చూస్తున్నట్టు గా తెలుస్తుంది…అందులో భాగం గానే కొంత మంది ప్లేయర్లని వాళ్ళ టీం లోకి తీసుకోవాలని చూస్తుంది…

ఇక అందుకోసమే ముంబై ఇండియన్స్ టీం ఇప్పటికే చాలా రకాల ప్లాన్స్ వేస్తున్నట్టు గా కూడా తెలుస్తుంది.అయితే ఈ టీం లోకి కొంత మంది ప్లేయర్లని తీసుకోవాలని చూస్తుంది అందులో మొదట గా బెన్ స్టోక్స్ ఉన్నాడు. ఈయన్ని చెన్నై టీం ఆక్షన్ లోకి వదులుతుంది అనే ఒక న్యూస్ అయితే చాలా వైరల్ అవుతున్న నేపధ్యం లో ఈ ప్లేయర్ మీద ముంబై టీం కన్నేసినట్టు గా తెలుస్తుంది… అయితే తను వస్తే ముంబై టీం లో అల్ రౌండర్ అలాగే ఫినిషర్ లేని లోటు తీరుతుంది అని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈయన్ని కనక చెన్నై టీం రిలీజ్ చేయకపోతే ఇంకో ఆల్ రౌండర్ అయిన మిచెల్ మార్ష్ ని టీం లోకి తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…మార్ష్ ప్రస్తుతం ఢిల్లీ టీం లో ఆడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈయన బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో కూడా తన మార్క్ చూపిస్తూ ఆడుతాడు. కాబట్టి ఈయన్ని కూడా తీసుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది…అయితే ముంబై టీం ఇంతకుముందే ఈ ఇద్దరు ప్లేయర్లని కలిసి వాళ్ళతో మాట్లాడినట్టు గా తెలుస్తుంది అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ ఇద్దరు ప్లేయర్ల లో ఎవరో ఒకరు మాత్రం పక్క ముంబై ఇండియన్స్ టీం లోకి వస్తున్నట్టు గా తెలుస్తుంది…

Read Today's Latest Sports news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు