Thodelu Movie Review: ‘తోడేలు’ మూవీ రివ్యూ
Thodelu Movie Review: గత ఏడాది నుంచి బాలీవుడ్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. వచ్చిన సినిమా వచ్చినట్టే వెను తిరుగుతోంది. ఇదే సమయంలో దక్షిణాది డబ్ సినిమాలు దున్నేస్తున్నాయి. అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్.. ఇలా ఎవరు చూసుకున్నా ప్లాప్ లతో బాధపడుతున్న వారే. కొంతమంది హీరోలు అయితే ఏకంగా తమ సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ బాలీవుడ్లో కొత్త ఆశలు […]

Thodelu Movie Review: గత ఏడాది నుంచి బాలీవుడ్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. వచ్చిన సినిమా వచ్చినట్టే వెను తిరుగుతోంది. ఇదే సమయంలో దక్షిణాది డబ్ సినిమాలు దున్నేస్తున్నాయి. అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రన్వీర్ సింగ్.. ఇలా ఎవరు చూసుకున్నా ప్లాప్ లతో బాధపడుతున్న వారే. కొంతమంది హీరోలు అయితే ఏకంగా తమ సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ బాలీవుడ్లో కొత్త ఆశలు రేకెత్తించింది. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు థియేటర్ గుమ్మం తొక్కేందుకు ఇష్టపడుతున్నారు. ఇదే ఊపును సాగించేందుకు బాలీవుడ్ మోస్ట్ ఈగర్లీ వెయిటింగ్ మూవీ రూపంలో శుక్రవారం బేడియా తెలుగులో ‘తోడేలు’ పేరుతో విడుదలయింది.

Thodelu Movie Review
-కథ ఏంటంటే
భాస్కర్ శర్మ (వరుణ్ ధావన్) రోడ్డు నిర్మాణాలకు సంబంధించి ఒక ఇంజనీర్. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఓ అటవీ ప్రాంతంలో హైవే రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు తన స్నేహితులు ( దీపక్ దోబ్రియా, పాలిన్ కబక్) తో కలిసి ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ వెళ్తారు. అటవీ ప్రాంతంలో రోడ్డు నిర్మాణాలను అక్కడి స్థానికులు అడ్డగిస్తారు. ఆ క్రమంలో వారిని ఒప్పించేందుకు భాస్కర్ శర్మ నానాతంటాలు పడతాడు. ఇదే నేపథ్యంలో అతడు తోడేలు కాటుకు గురవుతాడు. వెటర్నరీ డాక్టర్ అనైక మిట్టల్( కృతి సనన్) అతడికి వైద్యం చేస్తుంది. అయితే భాస్కర్ రాత్రి అయితే చాలు తోడేలుగా మారిపోతుంటాడు. ఆ తర్వాత భాస్కర్ శర్మకు అరుణాచల్ ప్రదేశ్ లో ఎదురైన సవాళ్ళు ఏంటి? భాస్కర్ ప్రయత్నాలకు స్థానికులు ఎలాంటి అభ్యంతరం చెప్పారు? వెటర్నరీ డాక్టర్ నుంచి అతడికి ఎలాంటి సహకారం అందింది? అనైక తో భాస్కర్ ప్రేమ సఫలమైందా లేదా? ప్రశ్నలకు సమాధానమే ఈ బేడియా కథ.
-చిన్న పాయింట్ తో..
ఈ సినిమా కథను చిన్న పాయింట్ తో మలిచిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ అటవీ అందాలు, తోడేలు విన్యాసాలు బాగా తెరకెక్కించారు. గ్రాఫిక్స్ వర్క్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తుంది.. అయితే సెకండ్ హాఫ్ సాగదీత లాగా అనిపిస్తుంది. కథనం, క్లైమాక్స్ మినహా మిగతాది మొత్తం ప్రేక్షకులు ఊహించినట్టే సాగిపోతూ ఉంటుంది. అయితే వీటిల్లో ప్రేక్షకులు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వకుండా తీసిన విధానం బాగుంది.
–ఎవరు ఎలా నటించారంటే
భాస్కర్ శర్మ పాత్రలో వరుణ్ ధావన్ చెలరేగిపోయాడు. ఇప్పటి వరకు హీరో పాత్రలకు, లవర్ బాయ్ పాత్రలకే పరిమితమైన అతడు.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. తోడేలుగా మారకముందు, మారిన తర్వాత అతడు చూపించిన హావాభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వరుణ్ ధావన్, అతడు స్నేహితులు చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.. ముఖ్యంగా వెటర్నరీ హాస్పిటల్ ఎపిసోడ్ హిలేరీస్ గా ఉంది. కృతి సనన్ వెటర్నరీ డాక్టర్ పాత్రలో మెప్పించింది. క్లైమాక్స్ లో ఆమె నటన నెక్స్ట్ లెవెల్ అంతే.

Thodelu Movie Review
-సాంకేతిక విభాగాల పనితీరు ఇలా
ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ చాలా బాగుంది.. త్రీడీ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతి కలిగిస్తుంది. తోడేలు వేటాడే సీన్లు అదిరిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్ అందాలను తెరపై బాగా చూపించారు. సచిన్ జిగర్ సంగీతం బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.. ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ వీకెండ్ లో తోడేలు సినిమా దుమ్ము దులపడం ఖాయం.
బాటం లైన్; తోడేలు రూపంలో బాలీవుడ్ కు పూర్వ వైభవం
రేటింగ్: 2.75/5