Thailand Husband and Wife: కార్యేశు దాసి కరణేషు మంత్రి బోర్జేషు మాతా శయణేషు రంభ అన్నారు. భార్యకున్న ప్రత్యేకతకు ఇదే నిదర్శనం. తన సర్వస్వాన్ని కట్టుకున్న వాడికోసమే అర్పిస్తుంది. పతి కోసం అహర్నిషలు శ్రమిస్తుంది. సంసారంలో భార్యదే ప్రముఖ పాత్ర కావడం విశేషం. అందుకే ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలని చెబుతారు. భర్త కోసం భార్య పడే పాట్లు అన్ని ఇన్ని కావు. జీవిత భాగస్వమి సుఖం కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. కట్టుకున్న వాడి సంక్షేమం కోసమే పాటుపడుతుంది. ఎలాంటి స్వార్థం చూసుకోకుండా సంసారంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. భర్త కోసం అనుక్షణం ఆలోచిస్తుంది. పతి ఆరోగ్యమే ప్రధానంగా నడుచుకుంటుంది.

Thailand Husband and Wife
ఓ భార్య తన భర్త కోసం చేయకూడని పని చేసింది. భర్తను పరాయి మహిళతో ఊహించుకోవడానికి కూడా ఇష్టపడని ఓ పడతి పతి కోసం ప్రియురాళ్లు కావాలని ప్రకటన ఇచ్చి సంచలనం సృష్టించింది. ఏ తప్పు చేసినా క్షమిస్తుంది కానీ తన భర్త ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకుంటే మాత్రం సహించదు. తాగుబోతు అయినా భరిస్తుంది. తిరుగుబోతు అయినా క్షమిస్తుంది. కానీ పరాయి కాంతలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మాత్రం చంపడానికైనా తెగిస్తుంది. అలాంటి ఓ భార్య తన భర్త కోసం ప్రియురాళ్లు కావాలని సోషల్ మీడియాలో పోస్టు చేయడం అందరిలో అనేక ప్రశ్నలకు కారణమైంది.
Also Read: Kiara Advani: పెళ్ళైన స్టార్ హీరో తో పబ్లిక్ గా రొమాన్స్ చేసిన కైరా అద్వానీ
థాయ్ లాండ్ లో ఫాతిమా అనే మహిళ తన భర్త కోసం గర్ల్ ఫ్రెండ్స్ కావాలని టిక్ టాక్ లో ప్రకటన పోస్టు చేయడంతో వైరల్ అయింది. దీంతో దీనిపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల స్పందనలు వస్తున్నాయి. కొందరేమో ఏదో ఫన్నీ కోసం పెట్టారని చెబుతుంటే మరికొందరు మాత్రం ఇదేదో గొప్పలకు పోయే విషయం అని కొట్టిపారేస్తున్నారు. కానీ ఫాతిమా మాత్రం ఇందులో ఎలాంటి హాస్యం లేదని నిజంగానే తన భర్తకు ప్రియురాళ్లు కావాలని చెప్పింది. ఇందుకు గాను వారికి నెలకు రూ.32 వేల జీతం ఇస్తామని ప్రకటించింది.

Thailand Husband and Wife
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్ వరకు చదువుకోవాలని నిబంధన విధించింది. 30-35 సంవత్సరాల మధ్య వయస్కురాలై ఉండాలి. తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలి. వారు మాతోనే ఉండొచ్చు. తన భర్త కష్టసుఖాలు చూసుకోవాలని చెబుతోంది. దీంతో ఆమె వ్యాఖ్యలకు అందరు ఆశ్చర్యపోతున్నారు. కట్టుకున్న భర్త కోసం ఇంతటి త్యాగం చేసే ఇల్లాలిని ఇంతవరకు చూడలేదని చెబుతున్నారు. పతి భక్తితో ఆ ఇల్లాలు చూపే తెగువను అందరు ప్రశంసిస్తున్నారు. ఆమె మంచితనానికి వేనోళ్ల పొగడుతున్నారు.
Also Read: Dasoju Sravan: కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ.. రాజగోపాల్ రెడ్డి బాటలో దాసోజు శ్రావణ్