KCR- Amit Shah: టిఆర్ఎస్, బిజెపి మధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. ఒకవైపు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ టిఆర్ఎస్ నాయకుల పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టిఆర్ఎస్ నాయకులు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు.. దీనికి తోడు కేంద్ర దర్యాప్తు సంస్థలు టిఆర్ఎస్ నాయకుల కదిలికలపై డేగ కళ్ళతో పర్యవేక్షిస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా బిజెపి నాయకులను ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఇదంతా జరుగుతూ ఉండగానే కేంద్ర హోం మంత్రి, బిజెపిలో నెంబర్ 2 అయిన అమిత్ షా పై సిట్ ను ప్రయోగించాలని కెసిఆర్ అనుకుంటున్నాడు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కథ వేరే విధంగా ఉంటుంది. వాస్తవానికి ఇవేవీ కూడా వర్క్ అవుట్ అయ్యే కేసులు కావు. ఒకరిని ఒకరు ఇరికించుకునేందుకు, రాజకీయంగా బద్నాం చేసేందుకు వేస్తున్న ఎత్తుగడలు కాబట్టి.

KCR- Amit Shah
కవితకు నోటీసులు పంపించడంతో..
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థలు 160 సెక్షన్ కింద నోటీసులు పంపించాయి.. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగి ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు లేనందున విచారణకు నేను రాను అని కవిత ద్వారా లేఖ పంపించాడు. మొన్నటిదాకా ఫామ్ హౌస్ డీల్స్ కేసులో బిఎల్ సంతోష్ ను టార్గెట్ చేసిన కేసీఆర్… ఈసారి కేంద్ర హోంశాఖ మంత్రి పై తన సిట్ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నాడు. కెసిఆర్ వీడియోల ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి ఉడికి పోతున్నాడు. అన్ని వీడియోలు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ లాగా ఉండవు కదా.. ఇదే సమయంలో కవిత చుట్టూ కేంద్రం ఉచ్చు బిగిస్తోంది. బిఎల్ సంతోష్ ను ఇరికించినట్టే… అమిత్ షాను కూడా ఇరికి స్తే సరి అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.. కవిత లాగే అమిత్ షా కూడా ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు లేదు అని సమాధానం ఇస్తాడని కేసీఆర్ అనుకుంటున్నాడు.

KCR- Amit Shah
రచ్చ చేయాలని
యుద్ధం అంటే యుద్ధమే.. అందులో కరుణారసానికి చోటు ఉండదు.. అమిత్ లేకుంటే మోదీ… నేరుగా నోటీసులు పంపిస్తే సరి. ఒక ముఖ్యమంత్రి కి ఒక ప్రధానిపై కేసు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. దేశ మీడియా మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది.. జి 20 సదస్సు వేళ రచ్చ రచ్చ అవుతుంది. పైగా ఇది భారత రాష్ట్ర సమితికి మంచి బూస్టర్ అవుతుంది.. “ఇలా చేస్తే మోడీ ఏం చేయగలడు? సర్జికల్ స్ట్రైక్స్ చేయిస్తాడా? అజిత్ దోవల్ ను తెలంగాణకు పంపిస్తాడా? జై శంకర్ తో సమావేశాలు నిర్వహిస్తాడా? మహా అయితే ఏదో కేసు పెట్టి జైల్లో వేస్తారు.. నన్ను టచ్ చేస్తే తెలంగాణ మొత్తం అగ్గి లేస్తది.. మా దగ్గర ఉన్న వీడియోలో 20 సార్లు అమిత్ షా పేరు ఉంది. కాబట్టి కేసులో పెట్టేస్తాం.. ఇక దాని నుంచి బయటపడడం ఆయన వల్ల కాదు.. ప్రధానమంత్రికి కూడా అదే వర్తిస్తుంది.. నేను ముందే చెప్పా.. గోకినా, గోకక పోయినా గోకుతూనే ఉంటామని. మీకే అర్థం కాలేదు.. ఏదీ ఆర్టికల్ 360 పెట్టి ప్రభుత్వాన్ని కూలదోయ్”
ఇవన్నీ మాటలు నిజంగా కేసీఆర్ అమల్లో పెడతాడా? కేవలం మీడియాకు లీకులు ఇచ్చి భయపెడతాడా? ఆ మధ్య కూడా గుజరాత్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రచారం చేస్తా, గాయి గత్తర లేపుతా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. కానీ ఊదు కాలలేదు. పీరీ లేవ లేదు. అమిత్ షా పై సిట్ టార్గెట్ కూడా అలాంటిదే. అది ఓ సుతిలి బాంబు. పేలదు, చావదు. కానీ ఒకవేళ అమిత్ షామీద్ కి సిట్ ను ప్రయోగిస్తే తెలంగాణ వర్తమాన రాజకీయాల్లో సంచలనం నమోదు అయినట్టే. కానీ కెసిఆర్ ఆ పని చేయగలడా?!