Rashi Phalalu: ఈ రాశి వారి సమస్యలు పరిష్కారం లభిస్తుంది.. నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే?
వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలి. లేకుంటే భవిష్యత్ లో సమస్యలు రావొచ్చు. ఆస్తి కొనుగోలుపై ఆచి తూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 2న గురువారం ద్వాదశ రాశులపై ఆద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. నేటి 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఇంట్లో వివాహ కార్యక్రమాలు చేసేందుకు సహకరిస్తారు. పి్లల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
వృషభం:
కుటుంబంలో సమస్యలు ఏర్పడవచ్చు. సాయంత్రం జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది.
మిథునం:
గతంలో చేసిన రుణాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:
జీవిత భాగస్వామి మాట వింటారు. ఆమె సలహాతో పెట్టుబడులు పెడుతారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఓ సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది.
సింహం:
కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారం రంగంలోని వారు రాణిస్తారు. ఇతరుల నుంచి ఓ శుభవార్త వింటారు.
కన్య:
వివాదాలను త్వరగా పరిష్కరించుకోవాలి. లేకుంటే భవిష్యత్ లో సమస్యలు రావొచ్చు. ఆస్తి కొనుగోలుపై ఆచి తూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు.
తుల:
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.
వృశ్చికం:
వ్యాపారం కోసం ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వివాదాలను పరిష్కరించుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇతరులను ఊరికే నమ్మకూడదు.
ధనస్సు:
అప్పుల కోసం కొందరు ఇబ్బంది పెడుతారు. వ్యాపారులకు ప్రతికూల వాతావరణం. నగదు వ్యవహారాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.
మకరం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. పరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిపై కొంత ఆందోళన చెందుతారు. కొన్ని శుభవార్తలు వింటారు.
కుంభం:
తల్లిదండ్రుల ఆశీస్సులతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉన్నతాధికారులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ప్రతీ పనిలో విజయం సాధిస్తారు.
మీనం:
శత్రువలతో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఆదిపత్యం చెలాయించే ప్రమాదం ఉంది. కొన్ని బాధ్యతలు పూర్తి చేయడంలో ఆందోళన చెందుతారు. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
