Protein Deficiency : ప్రస్తుతం చాలా మందిలో శృంగార కోరికలు తగ్గుతున్నాయి. మారుతున్న జీవన శైలితో యాభై ఏళ్లు రాకుండానే ఎంతో మంది శృంగారం పట్ల ఆసక్తి కనబరచడం లేదు. దీంతో పోషకాలు లేని ఆహారాలతో మన కోరికలు అడుగంటుతున్నాయి. దీనికి కారణం ప్రొటీన్ లోపమే అని వైద్యులు చెబుతున్నారు. లైంగిక ఆరోగ్యం ప్రభావితం చేసేది ప్రొటీన్ తెలిసినా దాన్ని తీసుకునేందుకు ఎవరు కూడా శ్రద్ధ కనబరచడం లేదు. ఈ నేపథ్యంలో శృంగారం మీద ఆసక్తి సన్నగిల్లడానికి చాలా కారణాలు ఉన్నాయి.
మహిళలకు రోజుకు 46 గ్రాముల ప్రొటీన్ అవసరం. ప్రతి రోజు కనీసం 15 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి. దీని కంటే తక్కువ ప్రొటీన్ తీసుకోవడం లోపం కలుగుతుంది. మహిళలకు ప్రొటీన్ లోపం ఉంటే అసంబద్ధ పీరియడ్లు, లైంగిక సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ప్రొటీన్ లేకపోవడం వల్ల టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గుతాయి. గర్భిణులు తగినంత ప్రొటీన్ తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులొస్తాయి. ప్రొటీన్ లోపం వల్ల కండరాలు దెబ్బతింటాయి. ప్రొటీన్ లోపం వల్ల ఎముకలు గుల్లబారతాయి.
ప్రొటీన్ రక్తప్రసరణ సరిగా జరిగేందుకు దోహదపడుతుంది. ప్రొటీన్ సక్రమంగా ఉంటే లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తుంది. పప్పు ధాన్యాలు, బీన్స్, చికెన్, గుడ్లు తింటే ప్రొటీన్లు అందుతాయి. లైంగిక ఆరోగ్యం బాగుండాలంటే ఇంకా కొన్ని ఆహారాలు తీసుకోవాల్సిందే. క్వినోవా సూపర్ ఫుడ్. క్వినోవాలో ప్రొటీన్ అవసరాన్ని తీర్చే 11 అమైనా ఆమ్లాలు కలిగి ఉంటుంది. ఇందులో రాగి, ఫైబర్, జింక్, ఇనుము, ఫొలేట్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు క్వినోవాను తీసుకుంటే ప్రొటీన్ మనకు దక్కుతుంది.
మొక్కజొన్నలో కూడా ప్రొటీన్లు దాగి ఉన్నాయి. ఇందులో ఫైబర్, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. దీంతో గ్లైస్ మిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర పెరిగే అవకాశం ఉండదు. చేపల్లో కూడా ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. వారానికి రెండు సార్లయినా చేపలు తీసుకోవడం మంచిది. రక్తప్రసరణను మెరుగుపరిచే ఆహారాల్లో ఇవి ముఖ్యమైనవి. గుడ్డులో కూడా ప్రొటీన్ ఉంటుంది. రోజుకు రెండు గుడ్లు తింటే 12 గ్రాములు ప్రొటీన్ లభిస్తుంది. కడుపు నిండుగా ఉంచే గుడ్డును తీసుకుంటే ఎంతో మంచిది.