Virat Kohli : ఇందుకే క్రికెట్ ప్రపంచానికి కోహ్లీ కింగ్ అయ్యాడు..!
అయినప్పటికీ విజయం సాధించలేకపోవడంతో బెంగళూరు జట్టు అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. మ్యాచ్ ఓటమి అనంతరం కోహ్లీ పెట్టిన కన్నీళ్లను అభిమానులు సామాజిక మాధ్యమాలు వేదికగా షేర్ చేస్తూ ఆవేదనను వ్యక్తం చేశారు.

సాధారణంగా అర్థ సెంచరీ, సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్నప్పుడు బ్యాటర్లు ఆచితూచి ఆడుతుంటారు. ఎందుకంటే ఈ భవిష్యత్తులో గొప్ప మైలురాళ్లుగా నిలిచే అవకాశం ఉంటుంది. గొప్ప గొప్ప ఆటగాళ్లు కూడా ఆ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పరుగు చేసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, కోహ్లీ మాత్రం అటువంటి లెక్కలేవి వేసుకోడు. జట్టుకు ఉపయోగపడుతుంది అనుకుంటే సెంచరీని కూడా లెక్కచేయకుండా రిస్కీ రన్ చేస్తుంటాడు. అటువంటి రిస్కీ రన్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చేశాడు విరాట్ కోహ్లీ. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ ఉన్నప్పుడు మిడిల్ స్టంప్ మీదుగా మోహిత్ శర్మ వేసిన బంతిని లాంగ్ ఆన్ మీదగా కోహ్లీ కొట్టాడు. అయితే అప్పటికే కోహ్లీ కొట్టిన బంతి ఫీల్డర్ వద్దకు వెళ్ళింది. అయితే కోహ్లీ మాత్రం వేగంగా పరుగు తీసే ప్రయత్నం చేసే క్రమంలో రన్ అవుట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు సెంచరీ కావాలి అనుకుంటే ఇక్కడ అంత రిస్కీ రన్ చేయాల్సిన అవసరం కోహ్లీకి లేదు. రెండు, మూడు బంతులు జిడ్డుకుని అయినా పరుగు చేసి సెంచరీ చేసే అవకాశం కోహ్లీకి ఉంది. అయితే, జట్టుకి కలిసి వచ్చే ఒక్క పరుగైనా విజయాన్ని అందిస్తుందన్న ఉద్దేశంతో కోహ్లీ ఆ రిస్కీ రన్ చేశాడని అభిమానులు పేర్కొంటున్నారు.