After Romance : శృంగారం తరువాత చేయకూడని పని ఇదే

After Romance : శృంగారంతో ఆరోగ్యం ముడిపడి ఉంది. వారానికి కనీసం ఓసారి శృంగారంలో పాల్గొనడం వల్ల కొన్ని రోగాలు రాకుండా ఉంటాయని వైద్యులే సూచిస్తున్నారు. దీంతో శృంగారం కూడా అత్యవసర కార్యంగానే పరిగణించబడుతోంది. శృంగారంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. ఇంకా అనేక రకాల సమస్యలకు శృంగారం దివ్య ఔషధంగా పనిచేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కానీ శృంగారం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లైంగికంగా పాల్గొన్న ప్రతిసారి అవయవాలను శుభ్రంగా చేసుకోవడం మంచిది. లేకపోతే […]

  • Written By: Shankar
  • Published On:
After Romance : శృంగారం తరువాత చేయకూడని పని ఇదే


After Romance : శృంగారంతో ఆరోగ్యం ముడిపడి ఉంది. వారానికి కనీసం ఓసారి శృంగారంలో పాల్గొనడం వల్ల కొన్ని రోగాలు రాకుండా ఉంటాయని వైద్యులే సూచిస్తున్నారు. దీంతో శృంగారం కూడా అత్యవసర కార్యంగానే పరిగణించబడుతోంది. శృంగారంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. ఇంకా అనేక రకాల సమస్యలకు శృంగారం దివ్య ఔషధంగా పనిచేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. కానీ శృంగారం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లైంగికంగా పాల్గొన్న ప్రతిసారి అవయవాలను శుభ్రంగా చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు తలెత్తడం ఖాయం. పరిశుభ్రతతోనే శృంగారంలో సమస్యలు రాకుండా ఉంటాయనేది నిర్వివాదాంశం.

ప్రైవేటు భాగాలను..

లైంగిక ఆరోగ్యం మెరుగు కావాలంటే ప్రైవేటు భాగాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శృంగారం తరువాత వాటిని కడుక్కుంటే సురక్షితంగా ఉంటుంది. అంతేకాని శృంగారంలో పాల్గొన్నాక జననాంగాలు కడుక్కోకపోతే వాసన వస్తాయి. దీంతో ఇతర రోగాలు కూడా చుట్టుముట్టే ప్రమాదం పొంచి ఉంది. మన జననాంగాలను నీటితో సున్నితంగా కడుక్కుంటే చాలు. ఇతర రసాయన ఉత్పత్తులను ఉపయోగించడం అంత మంచిది కాదు. శృంగారంలో పాల్గొన్న తరువాత మన శరీరంలో ఇతర ద్రవాలు కూడా విడుదల అవుతాయి. గోరువెచ్చని నీటితో కాని సబ్బుతో కాని స్నానం చేయడం సురక్షితం.

చాలా మంది

ఎక్కువ మంది యోనిని శుభ్రం చేయడానికి డౌచింగ్ వాడుతుంటారు. ఇది అంత మంచిది కాదు. యోని పీహెచ్ స్థాయి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. యోని తనను తాను శుభ్రం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అందుకే సాధారణ నీటితో కడిగితే సరిపోతుంది. కానీ ఏవేవో రసాయనాలు వాడితే సైడ్ ఎఫెక్ట్ లు రావడం గ్యారంటీ. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది వాడుతూ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. సాధారణ నీటితో శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది.

మూత్రాశయాన్ని..

శృంగారం తరువాత మూత్రాశయాన్ని ఖాళీ చేసుకోవాలి. మూత్రవిసర్జన చేయాలి. యోనిని నీళ్లతో కడిగితే మంచిది. శృంగారం తరువాత క్రిములు లోపలకు వెళ్లకుండా నియంత్రించే క్రమంలో మనం అప్రమత్తంగా ఉంటే సరి. భాగస్వామి క్రిములు మనలో ప్రవేశించే అవకాశాలు ఉన్నందున జననాంగాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం శ్రేయస్కరం. సంభోగంలో పాల్గొన్న ప్రతి సారి కండోమ్ లను మార్చండి. ఎందుకంటే ఒకటే కండోమ్ ప్రతిసారి వాడటం అంత మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ పెరుగుతుంది.

సంబంధిత వార్తలు