Pawan Kalyan Birthday: పవన్ బర్త్ డే రోజు ఇప్పుడు ఇదే ట్రెండింగ్
తెలుగు నాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ అగ్ర గన్యులు. అటు హీరో గానే కాకుండా.. రాజకీయ నాయకుడిగా అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. విపరీతమైన స్టార్డం ఉన్న ఆయన పొలిటికల్ గా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan Birthday: సాధారణంగా అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలు అంటే ఆ సందడే వేరు. హీరో పేరిట జన్మదిన కేకులు కట్ చేయడం, రోగులకు పండ్లు, పాలు పంచిపెట్టడం, సినిమాలను ప్రదర్శించడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటివి ఆనవాయితీగా వస్తున్నాయి. కానీ హీరోల నందు పవన్ కళ్యాణ్ వేరయా అన్నట్టు ఆయన జన్మదినం నాడు వెలుగు చూసిన అంశాలు వైరల్ గా మారుతున్నాయి.
తెలుగు నాట విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవన్ అగ్ర గన్యులు. అటు హీరో గానే కాకుండా.. రాజకీయ నాయకుడిగా అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. విపరీతమైన స్టార్డం ఉన్న ఆయన పొలిటికల్ గా కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలపరంగా హిట్, ప్లాఫ్ అన్న తేడా లేకుండా విపరీతమైన ప్రేక్షక అభిమానాన్ని పవన్ చురగొన్నారు. అటు రాజకీయాల్లో సైతం తనదైన పాత్ర పోషించ గలిగారు. దీంతో ఏపీలో ఒక కీలకమైన వ్యక్తిగా మారారు.
అటు సినీ రంగం.. ఇటు రాజకీయ రంగంలో పెనవేసుకున్నారు పవన్ కళ్యాణ్. విపరీతమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆయన పుట్టినరోజు వేడుకల్లో అరుదైన ఒక చిత్రం ఆవిష్కృతమైంది. పవన్ గోత్రనామాలు బయటికి వచ్చాయి. పుట్టినరోజు వేడుకలు మరో 10 రోజుల సమయం ఉందనగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ గోత్రనామం ఇది అంటూ.. ఆయన పేరిట పూజలు చేపట్టాలని ఒక వార్త వైరల్ గా మారింది. సర్వత్రా ఇది చర్చనీయాంశంగా మారింది. దాని సారాంశం ఏమిటంటే..
” పేరు కొణిదెల కళ్యాణ్ బాబు, జనకుల గోత్రం, మకర రాశి, ఉత్తరాషాడ నక్షత్రం” అంటూ చెప్పుకొస్తున్నారు. 51 ఏళ్ళు పూర్తిచేసుకున్న పవన్.. రేపు 52వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఫ్యాన్స్ ఈ రేంజ్ లో పూజలు, హోమాలు చేయించడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు అంటున్నారు. ఇదేందయ్యా ఇది.. కుల గోత్రాలు ట్రెండింగ్ ఏంటయ్యా.. ? కామెంట్స్ కూడా పెడుతున్నారు. పవన్ కు ఫ్యాన్స్ కాదు భక్తులు మాత్రమే ఉంటారని ఆయన ఫ్యాన్స్ మరోసారి ఋజువుచేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇవి విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినీ హీరోల యందు పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా అన్నట్టు పరిస్థితి తెలియజేసింది.
