Pawan Kalyan- Ali Daughter Wedding: ప్రముఖ హాస్యనటుడు అలీ కుమార్తె వివాహ వేడుకలో జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించలేదు.. ఇది ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు, అలీకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ నటించిన ఒకటి రెండు మినహా అన్ని సినిమాల్లోనూ ఆలీ ఉన్నారు. కానీ రాజకీయంగా వారిద్దరి ప్రయాణం వేరువేరుగా ఉంది. ముఖ్యంగా అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిందనే టాక్ ఉంది. అలీ చేరిన వైఎస్ఆర్ సీపీ ఆంధ్రలో అధికారంలోకి వచ్చింది. ఇటీవల అలీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులయ్యారు. ఈ కారణంగానే అలీ తన కుమార్తె వివాహానికి పవన్ కళ్యాణ్ ను పిలవలేదని ఒక చర్చ జరుగుతోంది. ఒకవేళ అలీ తన కూతురి వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రికను పవన్ కళ్యాణ్ కు గనుక ఇచ్చినట్టు ఉంటే ఫోటోలు మీడియాలో కనిపించేవని, అలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఆయన పిలవలేదని కొందరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు అలీ గనుక ఆహ్వానం పంపితే సోషల్ మీడియాలో కనీసం ఒక ట్వీట్ లేదా ఫోటో ఉండేది.. అందుకే అతను వెళ్ళకపోయి ఉండవచ్చు అని కొందరు అంటున్నారు.. అయితే అలీ వివిధ రాజకీయ పార్టీల నాయకులందరినీ ఆహ్వానించారు కాబట్టి… పవన్ కళ్యాణ్ ను కూడా ఆహ్వానించి ఉండవచ్చు. అలా వ్యవహరించేంత సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి కాదని సోషల్ మీడియాలో ఒక వర్గం చెబుతోంది.

Pawan Kalyan- Ali Daughter Wedding
మెగా ఫ్యామిలీని పిలిచాడు
తన కుమార్తె వివాహానికి అలీ మెగా ఫ్యామిలీ పిలిచాడు. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అరవింద్ వంటి వారిని ఆహ్వానించాడు. వారు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ని మాత్రమే ఆలీ ఎందుకు పిలువలేదు అనే సందేహాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాజకీయ సమీకరణల వల్ల ఆలీ కుమార్తె పెళ్లిని పవన్ కళ్యాణ్ దాటవేశారని సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు ట్రోల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో అలీ సన్నిహితంగా ఉండేవాడు. అలీపట్ల పవన్ కళ్యాణ్ కు బలమైన సెంటిమెంట్ ఉండేది. సర్దార్ గబ్బర్ సింగ్ దాకా ఆయన నటించిన అన్ని సినిమాల్లో అలీ ఉన్నాడు.. అలీకి పవన్ కళ్యాణ్ పట్ల బలమైన అనుబంధం ఉన్నది. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే ఒక టాక్ షోలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఇంటర్వ్యూచేసేందుకు అలీ ఆసక్తిగా ఉన్నట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పై అలీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇంతటి నేపథ్య ఉన్నప్పటికీ అలీ కూతురు పెళ్లికి పవన్ కళ్యాణ్ ఎందుకు హాజరు కాలేదు అనేది ఇప్పటికి సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.

Pawan Kalyan- Ali
నా అనే వాళ్ళ ఫంక్షన్ మిస్ చేయరు
పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ నా అనే వాళ్ళ ఫంక్షన్ ఎప్పటికీ మిస్ చేయరు. ఆ కార్యక్రమానికి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కచ్చితంగా హాజరవుతూ ఉంటారు. ఏదో ఒక రూపంలో తన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు.. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తన వివాహానికి సంబంధించి ఆహ్వాన పత్రిక అందిస్తే.. పవన్ కళ్యాణ్ ఆరోజు షూటింగ్ పూర్తి చేసి వివాహానికి హాజరయ్యారు. తన తరపున బంగారం బహుమతిగా ఇచ్చారు.. అంతే కాదు తాను నటించే ప్రతి సినిమాలోనూ టెక్నికల్ విభాగానికి సంబంధించి అతనికి అవకాశాలు ఇస్తున్నారు.. ఒక టెక్నికల్ అసిస్టెంట్ విషయంలో ఇంత ఉదారత చూపిన పవన్ కళ్యాణ్.. అలీ విషయంలో రాజకీయాలు చేస్తాడని ఎలా అనుకుంటాం? ఒకవేళ అలాంటి రాజకీయాలు చేసి ఉంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఆంధ్ర ముఖ్యమంత్రి అయ్యేవారు.. రాజకీయాన్ని రాజకీయం లాగా మాత్రమే చూసే పవన్ కళ్యాణ్.. వ్యక్తిగత సంబంధాల విషయంలో ఉదారత చూపుతారు. సరే ఈ విషయాలు పక్కన పెడితే… అలీ కుమార్తె వివాహానికి సంబంధించి పవన్ కళ్యాణ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.. ఈ మాట అంటున్నది సాక్షాత్తు అలీ కుటుంబ సభ్యులే.