Rohit Sharma: రెండు మ్యాచ్ లకి యంగ్ ప్లేయర్లను తీసుకోవడానికి రోహిత్ శర్మ చెప్పిన కారణం ఇదే…
అయితే ప్రస్తుతం ఉన్న టీం లో సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్ టన్ సుందర్ లాంటి ప్లేయర్లకి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది.

Rohit Sharma: ఆస్ట్రేలియా ఇండియా తో ఆడుతున్న మూడు మ్యాచుల్లో భాగంగా మొదటి రెండు మ్యాచులకి యంగ్ ప్లేయర్లని ఎందుకు తీసుకున్నారు, సీనియర్స్ ఎన్ని మ్యాచులు ఆడారు అని వాళ్ళకి రెస్ట్ ఇచ్చారు. అంటూ చాలా మంది సీనియర్ ప్లేయర్ల మీద బీసీసీఐ మీద చాలా రకాల కామెంట్లు చేసారు. కానీ దీనికి అసలు కారణం ఏంటి అనేది రీసెంట్ గా ఇండియన్ టీం కెప్టెన్ అయిన రోహిత్ శర్మ చెప్పడం జరిగింది.ఆయన ఏం చెప్పారు అంటే ఇండియా టీం ఇప్పుడు వరల్డ్ కప్ లో మ్యాచులు ఆడుతుంది.
కాబట్టి ఇండియా ఆడేది ఒకటి, రెండు మ్యాచులు కాదు దాదాపు 10 కి పైన మ్యాచులు ఆడుతుంది. కాబట్టి అందులో అన్ని మ్యాచులకి టీం లో ఉన్న అందరు ప్లేయర్లు అందుబాటు లో ఉండరు కాబట్టి బెంచ్ మీద ఉన్న ప్లేయర్లతో కుడా కొన్ని మ్యాచులు ఆడించాల్సి ఉంటుంది.అలాంటి టైం లో వీళ్లు టీం కి చాలా అవసరం అవుతారు కాబట్టి అందుకోసమే మేము వాళ్ళని ఆడిస్తున్నాం అంతే కానీ మాకు రెస్ట్ కావాలని మేము అలా మ్యాచ్ నుంచి పక్కి కి రాలేదు అంటూ చెప్పాడు. నిజానికి రోహిత్ శర్మ చెప్పింది ఒక వంతుకు కరేక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ప్లేయర్ కూడా అందుబాటు లో ఉంటె ఎవరికైనా ఇంజురీ అయిన లేదా ఏదైనా ప్రాబ్లమ్ అయిన కూడా తొందర గా బెంచ్ మీద ఉన్న ప్లేయర్లలో ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్లలో ఒకరిని ఆ ప్లేయరుకి రీప్లేస్ చేయవచ్చు…
అయితే ప్రస్తుతం ఉన్న టీం లో సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్ టన్ సుందర్ లాంటి ప్లేయర్లకి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుంది.ఎందుకంటే వాళ్లలో కొందరు బెంచ్ మీద ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పెర్ఫామెన్స్ ని బట్టి టీం కి ఎవరి అవసరం ఉంటె వాళ్ళని టీం లోకి తీసుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.దానికోసమే ఇప్పుడు ఈ మూడు మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ లు యంగ్ ప్లేయర్ల తో ఆడిస్తున్నట్టు గా తెలుస్తుంది…
