Kovai Sarala: కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఇదే…

ఇక ఈమె 1979 లో ఆర్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన వెళ్లి రత్నం అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయింది.అయితే ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్ర అయిన కుడా ఆమెకి చాలా మంచి గుర్తింపు వచ్చింది.

  • Written By: Dharma
  • Published On:
Kovai Sarala: కోవై సరళ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఇదే…

Kovai Sarala: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది నటులు మంచి పాపులారిటీ ని సొంతం చేసుకొని ఇండస్ట్రీ లో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సంపాదించుకుంటూ ఉంటారు అలాంటి వాళ్లలో కోవై సరళ ఒకరు… ఈమె అప్పట్లో చాలా సినిమాలో బ్రహ్మానందం కి జోడి గానటించి మంచి పేరు తెచ్చుకున్నారు. బ్రహ్మానందం తో పటు పోటీ పడి నటించి మెప్పించారు.ఇక ఈ జంట చాలా మంది జనాలకి కితకితలు పెట్టించారు అయితే మనందరిని నవ్వించిన కోవై సరళ జీవితం మాత్రం చాలా కష్టాలు కన్నీళ్లతో కూడుకుందనే చెప్పాలి.

ఇక ఈమె 1979 లో ఆర్ కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన వెళ్లి రత్నం అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయింది.అయితే ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్ర అయిన కుడా ఆమెకి చాలా మంచి గుర్తింపు వచ్చింది.దాంతో ఆమె ముందని ముగించు అనే తమిళ్ సినిమాలో గర్భిణీ స్త్రీ గా నటించింది.ఇక అప్పటి నుంచి ఆమె కెరియర్ మలుపు తిరిగిందనే చెప్పాలి.1987 లో మోహన్ బాబు హీరో గా వచ్చిన వీర ప్రతాపం అనే సినిమాలో నటించింది.

ఇక ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది.తను నటించిన మొదటి చిత్రం తోనే తెలుగు లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పటి నుంచి చాలా రకాలైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకుంది.ఇక బ్రహ్మనందం ఈమెది అయితే సూపర్ జోడి అనే చెప్పాలి వీళ్ల కాంబోలో వచ్చిన చివరి చిత్రం ప్రభాస్ హీరో గా వచ్చిన రెబల్ సినిమా…ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం కోవై సరళ ఇద్దరు కూడా వాళ్ల కామెడి తో ప్రేక్షకులను నవ్విస్తారు…

అయితే ఈమె మధ్య ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆవిడా ఈ విషయాలను పంచుకున్నారు.ఇక అందులో భాగంగానే ఆమె పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే ప్రస్తావన కూడా రావడం జరిగింది.దానికి ఆమె స్పందిస్తూ మా అక్క చెల్లెల్లా కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. వాళ్లందరికీ పెళ్లిళ్లు చేసి అందరిని విదేశాలలో సెటిల్ చేశాను నేను సంపాదించినా డబ్బులు మొత్తం వాళ్ళకే ఖర్చు చేశాను, వాళ్ల పిల్లల్ని చదివించాను ఇక ప్రస్తుతం నాదగ్గర ఏమి లేదు, ఉన్న ఈ కొద్దీ పాటి ఆస్తి మీద కూడా నాకుటుంబ సభ్యులు కేసు వేశారు అంటూ తన ఆవేదనని వ్యక్తం చేసారు…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు