Ram Charan: చైల్డ్ ఆర్టిస్ట్ గా రాంచరణ్ నటించిన ఒకే ఒక్క సినిమా అది

రామ్ చిన్నప్పుడే చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటించాడట. అదే అతని మొదటి సినిమా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

  • Written By: SS
  • Published On:
Ram Charan: చైల్డ్ ఆర్టిస్ట్ గా  రాంచరణ్ నటించిన ఒకే ఒక్క సినిమా అది

Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరోల హవా కొనాసాగుతోది. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం సినిమాలతో బిజీగా మారాడు. రీసెంట్ గా రామ్ నటించిన ఆర్ఆర్ఆర్ లో రామ్ నటనకు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ మైలేజ్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సౌత్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘గేమ్ ఛేంజర్’ అనే పేరు కూడా పెట్టారు. ఈ తరుణంలో రాంచరణ్ గురించి ఓ న్యూస్ సినీ సర్కిల్లో చెక్కర్లు కొడుతుంది.

రామ్ చిన్నప్పుడే చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటించాడట. అదే అతని మొదటి సినిమా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మెగా పవర్ స్టార్ గా గుర్తింపు పొందిన రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో రామ్ చరణ్ మొదటి సినిమా అయినా తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చినా సక్సెస్ అందుకోలేకపోయాడు. కానీ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘మగధీర’తో చెర్రీ లెవల్ మారిపోయింది.

అప్పటి నుంచి రామ్ చరన్ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. రీసెంట్ గా ఆయన చేసిన ఆర్ఆర్ఆర్ బంపర్ హిట్టు కొట్టిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా మెగాస్టార్ తనయుడు అయిన రాంచరణ్… తండ్రి తో కలిసి ఓ సినిమాలో చిన్నప్పుడే నటించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చిరంజీవి, దాసరి నారాయణరావు కాంబినేషన్లో వచ్చిన ఏకైక మూవీ ‘లంకేశ్వరుడు’. ఇది దాసరి కి 100వ చిత్రం కూడా. అయితే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీశారు. ఇందులో చరణ్ ఓ సీన్ చేశాడట.

అయితే సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎడిటింగ్ చేసే సమయంలో రామ్ చరణ్ సీన్ బెడిసి కొట్టినట్లు ఉందట. దీంతో దర్శకుడు దాసరి నారాయణరావు ఈ సీన్ తీసేయాలని చెప్పాడట. అందువల్ల రామ్ చరణ్ లంకేశ్వరుడు సినిమాలో కనిపించలేదు. కానీ అతను కెమెరా ముందుకు వచ్చింది మాత్రం లంకేశ్వరుడే అని చెప్పుకుంటున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు