Harikrishna Last Wish: హరికృష్ణ చివరి కోరిక ఇదేనట.. ఇన్నాళ్లకు బయటపడడంతో ఫ్యాన్స్ ఎమెషనల్..
Harikrishna Last Wish: గర్జించే సింహాంలా కనిపించే నందమూరి హరికృష్ణ ఇప్పుడు మన మధ్య లేరు. కానీ ఆయన సినిమాలు, గుర్తులను అభిమానులు నెమరేసుకుంటూ ఉంటారు. ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తండ్రికి దగ్గ తనయులుగా నిరూపించుకుంటున్నారు. సినిమాల్లో, రాజకీయంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఆ తరువాత ఆయనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్నాళ్ల తరువాత హరికృష్ణకు చెందిన […]


Harikrishna Last Wish
Harikrishna Last Wish: గర్జించే సింహాంలా కనిపించే నందమూరి హరికృష్ణ ఇప్పుడు మన మధ్య లేరు. కానీ ఆయన సినిమాలు, గుర్తులను అభిమానులు నెమరేసుకుంటూ ఉంటారు. ఆయన కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తండ్రికి దగ్గ తనయులుగా నిరూపించుకుంటున్నారు. సినిమాల్లో, రాజకీయంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఆ తరువాత ఆయనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్నాళ్ల తరువాత హరికృష్ణకు చెందిన ఓ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. జీవితంలో ఆయనకో చివరి కోరిక ఉండేదట. అది తీరకుండానే ఈ లోకాన్ని విడిచారని కొందరు చర్చించుకుంటున్నారు. ఆదేంటో చూద్దాం.
సినిమా రంగంలో నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అంతటి ప్రత్యేకత తెచ్చింది సీనియర్ ఎన్టీఆర్. తనదైన నటనాశైలితో తెలుగు సినిమా దశను మార్చిన ఎన్టీఆర్ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తారు. ఇప్పటికీ ప్రతీ కార్యక్రమంలో ఆయన పేరు వినబడకుండా ఉండదు. ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా రాజకీయంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన వారసులుగా ఆయన కుమారులు హరికృష్ణ , బాలకృష్ణలు సినీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ హరికృష్ణ మాత్రం ఎన్టీఆర్ పార్టీ స్థాపన నుంచే అయన వెన్నంటి ఉన్నారు. ఒకదశలో ఎన్టీఆర్ కు రైట్ హ్యాండ్ హరికృష్ణ అని అంటారు.
సొంత పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆయన ప్రవేశపెట్టిన రూ.2 కిలో బియ్య పథకం అనుసరించే ఇప్పుడు ప్రజలకు రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. పేదలకు పక్కా గృహాలు నిర్మించి వారి మన్ననలను పొందాడు. ఇటు రాజకీయంగా అనతి కాలంలోనే పట్టు సాధించి తెలుగువారికి ఆదర్శంగా నిలిచారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ఇప్పటికీ టీడీపీ నాయకులు చర్చలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ సామన్య ప్రజలకు మాత్రం ఎన్టీఆర్ గురించి పూర్తిగా తెలియదు.

Harikrishna Last Wish
అయితే హరికృష్ణకు ఎన్టీఆర్ గురించి అందరికీ వివరించాలని కోరిక ఉండేది. అంతేకాకుండా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్న ఆశ ఉండేది. ఆయన ఉన్నంతకాలం ఎప్పటికైనా ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యం కాలేదు. అయితే ఇన్నాళ్లకు ఆయన చివరి కోరిక ఇదేనంటూ మీడియాలో ప్రసారం కావడంతో ఆయన అభిమానులు ఎమోషనల్ గా ఫీలవుతున్నారు.