India Vs Pakistan: రిజర్వ్ డే వల్ల ఇండియా టీమ్ కి జరిగే అన్యాయం ఇదే…
అయితే ఒక 25 ఓవర్లు తర్వాత ఈ పిచ్ కొంచం ఫాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అప్పటివరకు పిచ్ చాలా వరకు డ్రై అవుతుంది కాబట్టి అప్పుడు బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తుంది.

India Vs Pakistan: ఏషియా కప్ మొత్తానికి హైలెట్ గా నిలిచే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి వర్షం నేది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే వర్షం కారణం గా ఒక మ్యాచ్ రద్దు అయింది.ఇక ఈ మ్యాచ్ అయిన సక్రమం గా సాగుతుందా అంటే ఇది కూడా వర్షం కారణం గా మధ్యలోనే ఆగిపోయింది…అయితే ఈ మ్యాచ్ కి రిజర్వ్ డే ఉంది కరెక్టే కానీ నిన్న సగం మ్యాచ్ ఆడక ఇప్పుడు ఇంకో రోజు ఇంకో సగం మ్యాచ్ ఆడటం వల్ల ఏ టీమ్ కి లాభం, ఏ టీమ్ కి నష్టం అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇండియా నిన్న మొదట బ్యాటింగ్ తీసుకొని 24 ఓవర్ల వరకు చాలా బాగా బ్యాటింగ్ చేసి సూపర్ గా ఆడిన విషయం మనకు తెలిసిందే అయితే నిన్న వాళ్ళు బాగా ఆడినప్పటికి నిన్న పిచ్ ఉన్న కండిషన్ వేరు ఇవాళ్ళ పిచ్ ఉన్న కండిషన్ వేరు కాబట్టి ఎంత వరకు మన టీమ్ ఎక్కువ స్కోర్ చేయగలదు అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం…
నిన్న హాఫ్ ఓవర్ల వరకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆడిన మన ప్లేయర్లు కి ఇవాళ్ళ అంత సాఫి గా ఆడటానికి అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి వర్షం కారణం గా పిచ్ తడిసి ఉంది కాబట్టి పిచ్ చాలా స్లో అవుతుంది దాని వల్ల బాల్ బ్యాట్ మీదకి రాదు అలాగే ఈ పిచ్ నార్మల్ గానే స్లో పిచ్ ఈ వర్షం వల్ల ఇంకా స్లో గా మారిపోతుంది దాంతో ఇక్కడ ఎక్కువ స్కోర్ చేయడం చాలా వరకు కష్టం అనే చెప్పాలి…ఇక బౌలర్ లకు చాలా వరకు అనుకూలిస్తుంది అనే చెప్పాలి…
అయితే ఒక 25 ఓవర్లు తర్వాత ఈ పిచ్ కొంచం ఫాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అప్పటివరకు పిచ్ చాలా వరకు డ్రై అవుతుంది కాబట్టి అప్పుడు బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తుంది… అంటే మొదట 25 ఓవర్లు మన వాళ్ళు ఆడుతారు ఆ తర్వాత 50 ఓవర్లు పాకిస్థాన్ ప్లేయర్లు ఆడుతారు కాబట్టి పిచ్ వాళ్ళు బ్యాటింగ్ చేసే సమయానికి వాళ్ళకి అనుకూలించే అవకాశం కూడా ఉంది ఇక ఇప్పటికే మన ఇండియా 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ మీద రిజర్వ్ డే మ్యాచ్ ఆడి ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు.ఇక మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు అనేది చాలా ఉత్కంఠ ని కల్గించే విషయం అనే చెప్పాలి…
