Tollywood Senior Heroes: తమిళ్ సీనియర్ హీరోలకి మన సీనియర్ హీరోలకి తేడా ఇదే…
ఇక ఇంతకుముందు కమల్ హాసన్ కూడా విక్రమ్ అనే సినిమాలో ఒక పిల్లవాడికి తాత గా నటించి మెప్పించాడు ఫైనల్ గా ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.

Tollywood Senior Heroes: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోల్లో చాలా మంది సీనియర్ హీరోలు వాళ్ళ ఏజ్ కి తగ్గ పాత్రలని ఎంచుకొని సక్సెస్ లు కొడితే బాగానే ఉంటుంది కానీ కొందరు అనవసరమైన పోకడలకు పోయి అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా హీరోయిన్స్ తో సాంగులు, రొమాన్స్ లు చేస్తే చూసే ఆడియెన్స్ కి చాలా చిరాకు పుడుతుంది నిజానికి ఇలాంటి సినిమాల్లో సీనియర్ హీరోలని చూడటానికి చాలా మంది ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపించరు. ఇక రీసెంట్ గా చిరంజీవి హీరో గా వచ్చిన సినిమా భోళా శంకర్ సినిమా ప్లాప్ అయినా విషయం మనం చూసాం… దాదాపు డెబ్భై సంవత్సరాలకి దగ్గరలో ఉండి ఒక యంగ్ హీరోయిన్ తో రొమాన్స్ చేయడాలు ఇవన్నీ జనాలకి విసుగు పుట్టించాయి దానితో ఆయన సినిమాని ప్లాప్ చేసారు ఇక అదే టైం లో రజినీకాంత్ హీరో గా వచ్చిన జైలర్ సినిమా మాత్రం సూపర్ సక్సెస్ సాధించింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రజినీకాంత్ అయన ఏజ్ గ్రూప్ కి సరిపడా క్యారెక్టర్ చేశారనే చెప్పాలి.దాంతో ఈ సినిమా చాలా పెద్ద హిట్ గా నిలిచింది.అందుకే మన హీరోలు కూడా కంటెంట్ బేస్డ్ మూవీస్ చేస్తే బాగుటుంది.
ఇక ఇంతకుముందు కమల్ హాసన్ కూడా విక్రమ్ అనే సినిమాలో ఒక పిల్లవాడికి తాత గా నటించి మెప్పించాడు ఫైనల్ గా ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.అందుకే మన సీనియర్ హీరోలు అయినా చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు హీరోయిన్స్ తో రొమాన్స్ లు కాకుండా ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తే బాగుంటుంది అని చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు…ఎంతసేపు మనమే తోపు అని కాకుండా కొంచం రియలిస్టిక్ గా ఉండే పాత్రలని ఎంచుకుంటే బాగుంటుంది.లేకపోతే వీళ్లు ఇలాంటివి ఎన్ని సినిమాలు తీసిన ఆడియెన్స్ మాత్రం వాటిని తిప్పి కొట్టాడుతూనే ఉంటారు…
