Chandrababu- BJP: చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీ ఫస్ట్ రియాక్షన్ ఇదే

వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ వెనుక బిజెపి హస్తము ఉందన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చింది.

  • Written By: Dharma
  • Published On:
Chandrababu- BJP: చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీ ఫస్ట్ రియాక్షన్ ఇదే

Chandrababu- BJP: చంద్రబాబు అరెస్టుపై ఎట్టకేలకు బిజెపి జాతీయ నాయకత్వం స్పందించింది. అరెస్టును ఖండించింది. అక్రమ అరెస్టు గా పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ని ఖండించారు. మరో నాయకుడు సత్య కుమార్ సైతం స్పందించారు. చంద్రబాబు రిమాండ్ తర్వాత మాత్రం వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు.

అయితే చంద్రబాబు రిమాండ్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. దీనికి మిత్రపక్షం జనసేన మద్దతు తెలిపినా.. బిజెపి మాత్రం ముందుకు రాలేదు. టిడిపి బందునకు బిజెపి మద్దతు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిని ఖండిస్తూ పురందేశ్వరి ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. దీంతో అందరూ బిజెపి వైపు అనుమానపు చూపులు చూశారు. ఇంతలో జాతీయ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. అయినా సరే ఎక్కడో ఒక రకమైన అనుమానం వెంటాడింది.

వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ వెనుక బిజెపి హస్తము ఉందన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చింది. అటు వామపక్షాలు సైతం కేంద్ర పెద్దలకు తెలియకుండా ఇది జరిగే ఛాన్స్ లేదని అనుమానం వ్యక్తం చేశారు. లండన్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న జగన్ కేంద్ర పెద్దలను నేరుగా కలుస్తారని వైసిపి ముమ్మర ప్రచారం చేసింది. దీంతో కేంద్ర పెద్దల అండదండలతోనే జగన్ చంద్రబాబును అరెస్టు చేయించారన్న ప్రచారం ఊపందుకుంది.

మరోవైపు జాతీయ స్థాయిలో విపక్ష ఇండియా కూటమి నుంచి పలు పార్టీల అధినేతలు చంద్రబాబు అరెస్ట్ పై స్పందించడం ప్రారంభించారు. ఆ కూటమికి చంద్రబాబు దూరంగా ఉన్నా వారు స్పందించడం విశేషం. అదే సమయంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు బిజెపికి సానుకూల ప్రకటనలు చేస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబుకు సంఘీభావం తెలపకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని బిజెపి భావించింది. అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ప్రత్యేక ప్రకటన ఇప్పించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ ను కిషన్ రెడ్డి ఖండించారు. ముందస్తు నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ చంద్రబాబు అరెస్టుపై ఎట్టకేలకు నోరు మెదిపినట్టు అయ్యింది.

Read Today's Latest Ap politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు