Venky Movie Train Scene: వెంకీ మూవీ ట్రైన్ సీన్ లో వీరు ఎవరూ గమనించని అద్భుత విషయం ఇదీ.. వైరల్ వీడియో

వెంకీ సినిమా వెండితెరపైకి 2004లో వచ్చింది. అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాణంలో వచ్చిన ఈ మూవీని శ్రీను వైట్ల డైరెక్షన్ చేశారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. శ్రావణి అనే అమ్మాయి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఆ అమ్మాయి ఓ కేసు విషయంగా చిక్కుల్లో పడుతుంది. ఆ సమస్య నుంచి వెంకీతో పాటు మరో ముగ్గురు ఆమెను కాపాడుతారు. ఈ క్రమంలో స్టోరీలో ఎన్నో ట్విస్టులు, మలుపులు తిరుగుతూ ఉంటాయి.

  • Written By: Chai Muchhata
  • Published On:
Venky Movie Train Scene: వెంకీ మూవీ ట్రైన్ సీన్ లో వీరు ఎవరూ గమనించని అద్భుత విషయం ఇదీ.. వైరల్ వీడియో

Venky Movie Train Scene: మాస్ మహారాజ రవితేజ తన సినీ కెరీర్లో ఎన్నో హిట్టు చిత్రాల్లో నటించారు. ఆయన అన్నిరకాలుగా నటించిన చిత్రం వెంకీ. శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ లవ్, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ తో కూడిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ నిలిచింది. మిగతా వాటికంటే ఈ సినిమాలో కామెడీకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో బ్రహ్మానందం, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇలా చాలా మంది కమెడియన్లు తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దీంతో వెంకీ సినిమాలోని ప్రతీ సీన్ హైలెట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం హాట్ టాపిక్ గా మారింది.

వెంకీ సినిమా వెండితెరపైకి 2004లో వచ్చింది. అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మాణంలో వచ్చిన ఈ మూవీని శ్రీను వైట్ల డైరెక్షన్ చేశారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. శ్రావణి అనే అమ్మాయి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఆ అమ్మాయి ఓ కేసు విషయంగా చిక్కుల్లో పడుతుంది. ఆ సమస్య నుంచి వెంకీతో పాటు మరో ముగ్గురు ఆమెను కాపాడుతారు. ఈ క్రమంలో స్టోరీలో ఎన్నో ట్విస్టులు, మలుపులు తిరుగుతూ ఉంటాయి.

అన్నిటికి మించి సినిమాలో కామెడీ ప్రధానంగా సాగుతుంది. ముఖ్యంగా ట్రైన్ లోని సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈసీన్ ఇప్పటికీ టీవీల్లో వస్తే తప్పకుండా చూస్తారు. వెంకీతో పాటు మరో ముగ్గురు కుర్రాళ్లు ఎస్సట్రైనింగ్ కోసం వైజాక్ నుంచి హైదరాబాద్ కు వెళ్తారు. ఈ క్రమంలో వారు టికెట్ తీసుకోకుండానే కొన్ని సీట్లలో కూర్చుంటారు. అయితే అప్పటికే రిజర్వేషన్ చేసుకున్న గజాలా, బొక్కా అనే వ్యక్తులు రాగానే టికెట్ తీసుకొని వారిన చూసి కాస్త అసహ్యంగా చూస్తారు. ఈ క్రమంలో వారు చేసే కామెడీ విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అయితే ఇక్కడ జరిగే సీన్ లో ఎక్కువ శాతం ప్రేక్షకులు బ్రహ్మానందం(గజాలా), ఏవీఎస్(బొక్కా)లపై ఫోకస్ ఉంచుతారు. కానీ ఇక్కడ మరోసీన్ జరుగుతుంది. కానీ ఆ సీన్ ను ఎవరూ గమనించరు. అయితే ఇంతకాలం తరువాత దీనిని కొందరు ఇప్పుడు బయటకు తీశారు. వాస్తవానికి ట్రైన్ లో ఉన్న ఈ సీన్ లో వీరిపై ఎవరూ దృష్టి పెట్టలేదని, కానీ ఇక్కడ శ్రీనివాసరెడ్డి పక్కన కళ్లద్దాలు పెట్టుకున్న అమ్మాయికి లైన్ వేస్తూ ఉంటారు. వాస్తవానికి సీన్ లో అదికూడా భాగమే. కానీ ఇప్పుడు చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

View this post on Instagram

A post shared by MEME_CHEDHAM (5k) (@meme_chedham_)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు